రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్

రిషబ్ పంత్.. టీమిండియా క్రికెటర్లలో స్టార్‌డమ్ వున్నోడు.! ఒకింత డైనమిక్ పర్సనాలిటీ.! దూకుడు చాలా చాలా ఎక్కువ. మైదానంలోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా.

నటి ఊర్వశి రౌతెలాతో రిషబ్ పంత్‌కి ఏదో ఎఫైర్ లాంటిది వుందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్యా సోషల్ మీడియా వార్ కూడా ఆ మధ్యన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదం సద్దుమణిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

తాజాగా, రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తృటిలో ప్రాణాపాయమైతే తప్పించుకోగలిగాడుగానీ.. చాలా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. తన లగ్జరీ కారులో వేగంగా దూసుకెళుతూ, రోడ్డు డివైడర్ మీదికి దూసుకెళ్ళాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. వాహనం తగలబడిపోయింది. రిషబ్ పంత్ శరీరంపై కాలిన గాయాలే ఎక్కువగా వున్నాయి. నుదుటికి దెబ్బ తగిలింది. కాలు కూడా విరిగిందని వైద్యులు చెబుతున్నారు.

అసలు ఈ ప్రమాదమెలా జరిగింది.? ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతున్నాడట.. అదీ కొత్త సంవత్సరం వేడుకల్ని తల్లితో కలిసి జరుపుకునేందుకట. తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడుగానీ, కాస్తంత జాగ్రత్తగా వెళ్ళాలన్న సోయ లేకుండా పోయింది. వేగంగా కారు దూసుకెళుతున్న సమయంలో అర్థరాత్రి కావడంతో చిన్న కునుకు పడ్డంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.