ఏపీలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు… టాప్ 5 లో స్థానం!

గతకొంతకాలంగా రిచ్చెస్ట్ సీఎం అంటూ టీడీపీ నేతలు, జనసేన అధినేత మైకులముందు నానా హడావిడీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన ఒక నివేధిక ప్రకారం ఇండియాలోని రిచ్చెస్ట్ పొలిటీషియన్స్ లో జగన్ ని కిందకు నెట్టిన చంద్రబాబు టాప్ 5 లో నిలిచారని తెలుస్తుంది.

అవును… తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదే క్రమంలో… భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.

భారతదేశంలో అత్యదికంగా ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల ఆర్థిక వివరాలను అసోసియేషన్ ఫర్ డెమక్రెటిక్ రిఫార్స్ పంప్థ వివరాలు వెళ్లడించింది. భారతదేశంలో అత్యదిక ఆస్తులు ఉన్న టాప్ టెన్ ఎమ్మెల్యేల వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ భారతదేశంలోనే అత్యదిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా మొదటి స్థానంలో నిలిచారు.

ఈయనతోపాటు కర్ణాటకకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు టాప్ టెన్ లోని నాలుగు స్థానాల్లో నిలవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. వీటిలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆస్తి రూ. 510 కోట్లు కాగా… నారా చంద్రబాబు ఆస్తి రూ. 668 కోట్లు అని నివేదిక పేర్కొంది!

1. డీకే శివకుమార్ – కర్ణాటక – కనకపుర – రూ. 1, 413 కోట్లు – కాంగ్రెస్

2. కేహెచ్. పుట్టస్వామి – కర్ణాటక – గౌరిబిదనూరు – రూ. 1, 267 కోట్లు – ఇండిపెండెంట్

3. ప్రియాక్రిష్ణ – కర్ణాటక – గోవిందరాజనగర (బెంగళూరు) – రూ. 1, 156 కోట్లు – కాంగ్రెస్

4. నారా చంద్రబాబు నాయుడు – ఆంధ్రప్రదేశ్ – కుప్పం – రూ. 668 కోట్లు – టీడీపీ

5. జయంతి బాయ్ – గుజరాత్ – మానస – రూ. 661 కోట్లు – బీజేపీ

6. బైరతి సురేష్ – కర్ణాటక – హెబ్బాళ – రూ. 648 కోట్లు – కాంగ్రెస్

7. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ – పులివెందుల – రూ. 510 కోట్లు -వైఎస్ఆర్సీపీ

8. పరాగ్ షా – మహారాష్ట్ర – ఘటకేస్కర్ ఈ స్ట్ – రూ. 500 కోట్లు – బీజేపీ

9. టీఎన్. బాబా – చత్తీస్ ఘడ్ – అంబికాపుర – రూ. 500 కోట్లు – ఐ.ఎన్.సీ

10. మంగళ ప్రభాత్ లోథా – మహారాష్ట్ర – మలబార్ హిల్- రూ. 441 కోట్లు – బీజేపీ