దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రధాన నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది. కరోనా విజృంభిస్తున్న కారణంగా పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, కాంట్రాక్టర్లు కార్పోరేట్ ఆసుపత్రులలో ముందుగానే ఖర్చీఫ్ వేసుకున్నారు. వైరస్ మున్ముందు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంటుందేమోనని ఊహించిన బడాబాబులందరూ ముందుగానే ఆసుపత్రులలో బెడ్లు రిజర్వ్ చేసుకున్నారు.
Read More : ముఖ్యమంత్రికి కరోనా..ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్
రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో సామాన్యుల నుంచి వీఐపీల దాకా ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఆసుపత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళలేని వారంతా ప్రైవేట్ ఆసుపత్రుల బాట పట్టడంతో ఇప్పటికే ఏ ఆసుపత్రి చూసినా బెడ్స్ ఫుల్ అయిన బోర్డులు కనిపిస్తున్నాయి. వైరస్ ఉదృతి ఇంకా తక్కువగా ఉన్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే కరోనా పీక్ స్టేజుకు చేరుకుంటో పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌లోని బడా బాబులు వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
Read More : ష్చ్.. బాబు గారు నిలుపుకుంటారా..?
అయితే కరోనా సోకితే ఏం చేయాలన్న దానిపై కోట్లకు కోట్లు డబ్బున్న సంపన్నులంతా ఓ కొత్త పంతాకు తెరలేపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హోటల్స్‌లో రూములు బుక్ చేసుకుంటున్నట్టు ముందుగానే ఆసుపత్రులో ఉన్న రూములను కూడా తమ పేరిట అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారట. ఆసుపత్రిని బట్టి, వారు అందించే వసతులను బట్టి ఒక్కో రూముకు కోటిన్నర నుంచి రెండున్నర కోట్లను ముందుగానే చెల్లిస్తున్నారట. తమకు వైరస్ సోకిన సమయానికి ఆసుపత్రులలో బెడ్లు దొరకకపోతే ఎలా అని ఆలోచించిన డబ్బున్న వారంతా దాదాపు ఆరు నెలల పాటు లగ్జరీ రూములపై తమ ఖర్చీపులు వేసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా వచ్చినా రాకున్నా వారి పేరిట బుక్ అయిన సూట్ గదులకు రోజుకు లక్ష రూపాయలు కడుతున్నారట.
Read More : `పుష్ప` కోసం బీస్ట్ లాంటోడు బక్క చిక్కాడు