ఇది క్లియర్.! టీడీపీకి షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.!

Rajya Sabha Elections

Rajya Sabha Elections : అరరె.! తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.కృష్ణయ్య ఇప్పుడు వైసీపీ నేతగా మారిపోయారే.! ఇప్పుడేంటి చంద్రబాబు పరిస్థితి.? ఏదో ఎన్నికల కోసం హడావిడిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్.కృష్ణయ్యని తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారుగానీ, ఆ ఎన్నికల్లో గెలిచే అవకాశం వుంటే.. ఆర్.కృష్ణయ్యను అలా ముందుకు చంద్రబాబు ఎగదోసేవారా.?

బీసీ ఓటు బ్యాంకు లక్ష్యంగా.. తెలంగాణ రాజకీయాల్లో అలజడి సృష్టించే విధంగా చంద్రబాబు అప్పట్లో వేసిన ఆ ప్లాన్ భగ్నమైంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతయ్యింది కూడా. ఇప్పుడు అదే ఆర్.కృష్ణయ్యకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశం కల్పించారు. ఎంత తేడా.? ఔను, చాలా తేడా వుంది.

చంద్రబాబు వేరు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేరు. ఒకప్పుడు బీసీలు టీడీపీకి వెన్నెముక. కానీ, ఆ బీసీలకు చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు.. తన సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చుకున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన నేతల లిస్ట్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది.

సీన్ మారింది.! టీడీపీ నుంచి రాజ్యసభకు ఎవరూ ఇప్పుడు కొత్తగా వెళ్ళే అవకాశం లేదు. సరిగ్గా ఈ సమయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యద్భుతంగా వినియోగించుకున్నారు. ఇద్దరు బీసీ నేతలు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు.. ఇద్దరు ఏపీ నుంచి, ఇద్దరు తెలంగాణ నుంచి.. ఈక్వేషన్ అదిరిపోయింది.

బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి మిగతా ఇద్దరు. విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలం పొడిగింపు లభించనుంది.