కొత్త లాజిక్: గ్రూప్-1 పేపరే లీక్ చేసినోళ్లకు ఇదొక లెక్కా?

విద్యార్థులకు, నిరుద్యోగులకు, పోటీపరీక్షల అభ్యర్థులకు, వారి వారి తల్లితండ్రులకు షాకిస్తూ… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనకార్యకరమాలు ఛేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేటీఆర్, ఆయన పీఏ తిరుపతి ల పాత్ర కీలకం అని ఇప్పటికే రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న క్రమంలో… ఈ యవ్వారం మొత్తం రాజశేఖర్ రెడ్డే చేశారని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో… మరో నిరసనకు తెరలేపాయి విద్యార్థి సంఘాలు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తెలంగాణలోని విద్యార్థి సంఘాలు మరోసారి ముట్టడించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వివిధ సంఘాల విద్యార్థి నేతలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీలో కొత్త కోణాలు బయటపెట్టారు. గ్రూప్ – 1 ప్రశ్నాపత్రాల కేసులో ప్రధాన నిందితుడు అయిన రాజశేఖర్ రెడ్డి తల్లి.. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డిపార్ట్మెంట్ లో పని చేశారని.. ఫలితంగా సీడీపీవో ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కాబట్టి… సీడీపీవో పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దానికి సరైన కారణాలు చెబుతున్న విద్యార్థి సంఘాల నేతలు… గ్రూప్ – 1 పరీక్ష తర్వాతే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పరీక్ష జరిగిందని.. అలాంటప్పుడు ఆ పరీక్షను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ – 1 ఎగ్జామ్ పేపర్ నే లీక్ చేసినోళ్లు.. సీడీపీవో పేపర్ ను లీక్ చేయరా.. చేసి ఉండరా.. అనేది వారి ప్రధాన లాజిక్ కాగా… లీకేజ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్ది తల్లి.. ఆ డిపార్ట్ మెంట్ లోనే పని చేస్తున్నారనేది వారి నమ్మకం గా ఉంది! ఇన్ని అనుమానాలు, లాజిక్కులు, కుట్ర కోణాలు ఉన్నాకూడా ఆ ఎగ్జామ్ ను ఎందుకు రద్దు చేయడంలేదో చెప్పాలని నిలదీస్తున్నారు విద్యార్థులు! మరి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి!