Narendra Modi: పాక్ నుంచి తూటా వస్తే భారత్ నుంచి బాంబే: మోదీ మాస్ వార్నింగ్

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ఏమాత్రం వెనకడుగు వేసే ఉద్దేశం లేదని, వారి చర్యలకు రెట్టింపు స్థాయిలో సమాధానం ఇవ్వాలని మోదీ స్పష్టం చేసినట్టు ఏఎన్ఐ కథనం పేర్కొంది.

“వారి తూటాకు మన బాంబే సమాధానం. ఒక వైపు వారు కాల్పులు ప్రారంభిస్తే, మరింత శక్తివంతమైన ప్రతిదాడికి మన సైన్యం సిద్ధంగా ఉండాలి. ఎల్ఓసీ వెంబడి దొంగచాటుగా జరిపే దాడులకు ఇక ఒకే పరిష్కారం.. కఠిన ప్రతిస్పందన” అని మోదీ ఆదేశించినట్టు సమాచారం. సరిహద్దులో జవాన్లకు కొత్త తాలిమలు, హై అలర్ట్ మోడ్ ఆదేశాలు ఇప్పటికే వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తరహా ఆకస్మిక దాడులకు కొనసాగింపుగా పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరికగానే భావిస్తున్నారు విశ్లేషకులు. పీఓకే పై గత కొన్నిరోజులుగా జరుగుతున్న వ్యూహాత్మక సన్నాహాలు, డ్రోన్ల ద్వారా నిఘా, అదనపు బలగాల మోహరింపుతో పరిస్థితి వేడెక్కినట్టు భావిస్తున్నారు.

మరోవైపు, పాకిస్థాన్ తాజా చర్యలు – కాల్పుల విరమణ ఒప్పందం తరువాత కూడా నిరంతర దాడులు – భారత్ వైఖరిని మరింత గట్టి చేస్తోందని ఓ రిటైర్డ్ జవాన్ వ్యాఖ్యానించారు. “ఇక మౌనం మాకెప్పుడూ బలంగా మారదు. సమాధానం ఖచ్చితంగా ఉంటే, అది గట్టిగానే ఉంటుంది” అన్నారు. సరిహద్దు పరిస్థితులపై త్వరలో పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ప్రకటన చేయవచ్చని, దీనిపై అధికారిక సమాచారం రావచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

యుద్ధ రంగంలోకి సచిన్, ధోని..|| Territorial Army Enter In War || MS Dhoni || Sachin Tendulkar || TR