కేసీఆర్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని, మనుగడ కాపాడుకోవాలని బలంగా భావిస్తున్న ఆయన.. తెలంగాణలో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఒక టీం ని కూడా ఫైనలైజ్ చేసిన ఆయన… వారితో కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతోందని పవన్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ నేతలకు పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలోనూ వారాహి యాత్ర ఉంటుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. జనసేన సత్తా చూపించేలా 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జ్‌ లను ప్రకటించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ ఇప్పటివరకూ తెలంగాణలో ఉన్న బలం గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. ఏపీలో ఏయే ప్రాంతాల్లో, ఏయే జిల్లాల్లో ఎంత బలం ఉందనేది ప్రకటించిన ఆయన… తెలంగాణ విషయంలో ఎలాంటి వివరాలూ చెప్పలేదు. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం కచ్చితంగా కేసీఆర్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి!

కారణం… ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు భారీ పోటీ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా తమకే పడుతుందని కాంగ్రెస్ భావిస్తుండగా… బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంటుంది. ఈ రెండు పార్టీలే కాకుండా… తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి వైఎస్సార్ టీపీ, బీఎస్పీ, కమ్యునిస్టులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి.

ఈ సమయంలో వారితో పాటు జనసేన కూడా చేరితే అది కచ్చితంగా కేసీఆర్ కు ప్లస్ అవుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలడం వల్ల బీఆరెస్స్ కు మెరుగైన ఫలితాలు రావొచ్చని తెలుస్తుంది. మరి ఉన్నపలంగా తెలంగాణ ఎన్నికలపై పవన్ తీసుకున్న ఈ నిర్ణయం సొంత నిర్ణయమేనా.. లేక, కేసీఆర్ – కేటీఆర్ ల వ్యూహాల ఫలితంగా వచ్చిన నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది!

అయితే… పవన్ ప్రకటించిన 26 మంది అభ్యర్థుల లిస్ట్ ఇలా ఉంది.

1. శ్రీ వేమూరి శంకర్ గౌడ్ – కూకట్ పల్లి

2. శ్రీ పొన్నూరు లక్ష్మి యి శిరీష – ఎల్బీనగర్

3. శ్రీ వంగ లక్ష్మణ గౌడ్ – నాగర్ కర్నూలు

4. శ్రీ తేజవత్ సంపత్ నాయక్ – వైరా

5. శ్రీ మిరియాల రామకృష్ణ – ఖమ్మం

6. శ్రీ గోకుల రవీందర్ రెడ్డి – మునుగోడు

7. శ్రీ నందగిరి సతీష్ కుమార్ – కుత్బుల్లాపూర్

8.డాక్టర్ మాధవరెడ్డి – శేరిలింగంపల్లి

9. శ్రీ ఎడమ రాజేష్ – పటాన్ చెరువు

10. శ్రీమతి మండపాక కావ్య -సనత్ నగర్

11. శ్రీ వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు – ఉప్పల్, శివ కార్తీక్ కో కన్వీనర్ – ఉప్పల్

12. శ్రీ వేముల కార్తీక్ – కొత్తగూడెం

13. శ్రీ డేగల రామచంద్రరావు – అశ్వరావుపేట

14. శ్రీ శ్రీ వి.నగేష్ -పాలకుర్తి

15. శ్రీ మేరుగు శివకోటి యాదవ్ -నర్సంపేట

16. శ్రీ గాదె పృద్వి – స్టేషన్ ఘన్ పూర్

17. శ్రీ తగరపు శ్రీనివాస్ – హుస్నాబాద్

18. శ్రీ మూల హరీష్ గౌడ్ – రామగుండం

19. శ్రీ టెక్కల జనార్ధన్ – జగిత్యాల

20. శ్రీ చెరుకుపల్లి రామలింగయ్య -నకిరేకల్

21. శ్రీయన్ నాగేశ్వరరావు – హుజూర్ నగర్

22. శ్రీ మాయ రమేష్ – మంథని

23. శ్రీ మేకల సతీష్ రెడ్డి – కోదాడ

24. శ్రీ బండి నరేష్ – సత్తుపల్లి

25. శ్రీ వంశీకృష్ణ – వరంగల్ వెస్ట్

26. శ్రీ బాలు గౌడ్ – వరంగల్ ఈస్ట్