NSA Ajit Doval: ఎస్-400 బలాన్ని పెంచే రణరంగానికి దోవల్ దౌత్యం!

భారత గగనతల రక్షణను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 400 కిలోమీటర్ల పరిధిలో యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను గుర్తించి తుంచేయగల ఈ రష్యా సాంకేతిక కవచం, భారత్‌కి ఇప్పటికే మూడు యూనిట్లుగా అందింది. పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య సరిహద్దుల్లో వాటిని మోహరిచారు. ఇప్పుడు మిగిలిన రెండింటి కోసం భారత్ చురుగ్గా ముందుకు సాగుతోంది.

2018లో భారత్-రష్యాల మధ్య రూ. 35 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఐదు ఎస్-400 వ్యవస్థలు అందించాల్సిన ఈ డీల్‌లో, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా డెలివరీలు ఆలస్యం కావడంతో గగనతల భద్రత విషయంలో భారత ఆందోళన పెరిగింది. వాస్తవానికి 2026లోగా పూర్తి డెలివరీగా షెడ్యూల్ ఉన్నా, ఈ మద్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయంతో వేగం పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మే 27 నుంచి మాస్కో పర్యటనకు వెళుతున్నారు. అంతర్జాతీయ భద్రతా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సిన దోవల్, ఈ సందర్భంగా రష్యా రక్షణ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎస్-400 మిగతా రెండు యూనిట్లను తక్షణం అందించేలా ఒత్తిడి తెచ్చే యత్నం ఇదే కానుంది.

షెడ్యూల్ కంటే ముందే యూనిట్లు అందితే, భారత్ గగనతల భద్రత మరింత పటిష్టమవుతుంది. పాకిస్తాన్, చైనా వంటి సవాళ్ల మధ్య ఈ అత్యాధునిక కవచం అత్యవసరంగా మారింది. రష్యా సహకారంతో వేగవంతమైన అమలు జరిగితే, భారత వైమానిక దళానికి ఇది మైలురాయిగా నిలవనుంది.

పూనమ్ పై త్రివిక్రమ్ మౌనం || Journalist Bharadwaj EXPOSED Poonam Kaur & Tri Vikram Controversy || TR