ఆరునెలలు సావాసం చెస్తే వారు వీరవుతారని సామెత. అంటే.. ఆరు నెలల పాటు సహవాసం చేస్తే.. వీరి లక్షణాలు కొన్ని వారికి, వారి లక్షణాలు కొన్ని వీరికి అబ్బుతాయనేది దాదాపుగా దానర్ధం! ప్రస్తుతం జనసేన నాయకులు చేస్తున్న కామెంట్లు గమనించినవారు.. గతంలో ఇవే కామెంట్లు బాబుగారి నోటినుండి జాలువారిన విషయం గుర్తుకు తెచ్చుకుని ఈ సామెతను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు!
వివరాల్లోకి వెళ్తే… 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం, షాక్ లో అన్నారో లేక మరేదైనా మానసిక సమస్య వల్ల అన్నారో తెలియదు కానీ.. “ఈ ఎన్నికల్లో ప్రజలే ఓడిపోయారు” అని పలికారు బాబు! అక్కడితో ఆగారనుకుంటే పొరపాటే… “జగన్ ను గెలిపించుకున్నారు.. ఇప్పుడు అనుభవించుకోండి” అంటూ శాపనార్థాలు కూడా పెట్టారు!
అనంతరం నాన్నోరిని ఫాలో అయిన చినబాబు… తాజాగా మొదలుపెట్టిన పాదయాత్రలో ఇదే విషయాన్ని మరోసారి తెలిపారు. “2019 ఎన్నికల్లో ఓడింది ఏపీ ప్రజలే” అని ప్రకటించేశారు. ఇదేందయ్యా ఇది అని టీడీపీ నేతలే షాకవుతున్న స్థాయిలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చారు తండ్రీ కుమారులు!
వారొకటి మేమొకటా అనుకున్నారో లేక ఆరునెలల సావాస ఫలితమో కానీ.. దిమ్మతిరిగే స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చుకున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అవును… తాజాగా మైకందుకున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్గ… “గత ఎన్నికలో ప్రజలు ఓడిపోయారు” అన్నారు. ప్రజలు ఓడిపోవడం ఏంటో ఒక పట్టాన్న అర్థం కాని విషయం!
అసలు ప్రజాస్వామ్యం అంటే… “మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ప్రసాదించండి ప్రభువులూ” అని ఆయా పార్టీలు ప్రజలకు రిక్వస్ట్ పెట్టుకుంటాయి. ఆ సమయంలో ప్రజలు ఐదేళ్లకు తీర్పు ఇస్తారు. వారు అవునన్నవాడు మంత్రి – కాదన్నవాడు కంత్రి అన్న చందంగా తీర్పు వచ్చేస్తాది. అది ప్రజాస్వామ్యం – ఎన్నికల విధానం!
కానీ… చిత్రంగా తమ పార్టీ అధికారంలోకి రాకపోతే.. ప్రజలు తప్పు చేశారు అని, ప్రజలే ఓడిపోయ్యారు అని ఇలా లాజిక్కులు లేని అర్థజ్ఞాన స్టేట్ మెంట్స్ ఇవ్వడం ఏమిటో… అర్థజ్ఞానానికి – అజ్ఞానానికి మధ్య కొట్టుమిట్టాడుతూ అదే జ్ఞానం అనుకునే కొందరు ఇలాంటి అప్రజాస్వామిక స్టేట్ మెంట్స్ ఇస్తుంటారనే కామెంట్లు ఈ సందర్భంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి!!