వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నాడన్న కారణంగా ఆయనపై పార్టీ పలుమార్లు సీరియస్ అవ్వడమే కాకుండా, వైసీపీ ఎంపీలంతా కలిసి లోక్‌సభ స్పీకర్‌కు ఆయనపై అనర్హత పిటీషన్ కూడా ఇచ్చారు.
Read More : ఆ లెక్షరర్‌కి ఫోన్ చేసి కలవాలన్న సీఎం కేసీఆర్..!
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ రఘురామకృష్ణం రాజుకు మధ్య తీవ్రమైన వార్ కొనసాగుతుంది. మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రఘురామకృష్ణంరాజుపై కేసులు కూడా పెట్టారు. అయితే తనపై నమోదైన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్‌ని కూడా ఆశ్రయించారు.
అయితే తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణం రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read More : విశాఖ వరుస ఘటనలలో విజయసాయి హస్తం ఉందా?
పార్టీకి, ప్రభుత్వానికి చాలా తేడా ఉందని నేనెప్పుడూ మా పార్టీకి కానీ, పార్టీ అధ్యక్షుడికి కానీ ఒక సలహా కూడా ఇవ్వలేదని అన్నాడు. పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని, తాను ప్రభుత్వానికి మాత్రమే కొన్ని సూచనలు ఇచ్చానని అన్నాడు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాల గురుంచి మాత్రమే నేను మాట్లాడనని వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే తన తరుపున ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. మా పార్టీకి, నాకు మధ్య కొంతమేరకు మీడియానే చిచ్చు పెడుతుందని దయచేసి అది మానుకోమని అన్నారు. నాకు మా పార్టీకి ఎలాంటి విబేధాలు లేవని తేల్చి చెప్పారు.