వచ్చే వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ కూడా తెలిసిపోయింది!

Bigg Boss 4 Telugu

బిగ్ బాస్ తెలుగు టీవీ షో టెలివిజన్ ప్రపంచంలో అత్యంత వినోదాత్మక రియాలిటీ షోలలో ఒకటి. అయితే ఇది చాలా మంది అనుకున్నట్టు స్క్రిప్ట్ షో కాదని తెలుస్తుంది . అదే సమయంలో, ఎలిమినేట్ అవుతున్న వారు మాత్రం కేవలం ప్రేక్షకులు పోస్ట్ చేసిన ఓట్లపై ఆధారపడి అవడంలేదనేది గత కొన్ని ఎలిమినేషన్స్ చూస్తే అర్థం అవుతుంది.

Monal Gajjar
Monal Gajjar

ఇటువంటి వివాదాస్పద ఎలిమినేషన్స్ ప్రతి సీజన్‌ లో జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవి నాగవల్లిని తొలగించినప్పుడు, బిగ్ బాస్ నిర్వాహకుల మీద చాలా వ్యతిరేకత వచ్చింది . ఇప్పుడు, కుమార్ సాయిని తొలగించడంపై కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి.

అనధికారికంగా, ఇంటర్నెట్లో చాలా పోల్స్ జరిగాయి. వాటిల్లో అందరూ మోనాల్ ఇంటి నుండి బయటకు రావాలని కోరుకున్నారు. కానీ, కుమార్ సాయికి ఈసారి తక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ నిర్వాహకులు పేర్కొన్నారు.

గత ఎపిసోడ్ ముగిసే సమయానికి కుమార్ సాయి మరియు మోనాల్ డేంజర్ జోన్లో ఉన్నారు, కాని కుమార్ సాయిని ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున అక్కినేని ప్రకటించారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వారంలో కూడా మోనాల్ నామినేషన్లలోకి రావడంతో, ఆమె బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా వుంది.