ఏ రాజకీయ పార్టీలో అయినా అసంతృప్తి మామూలేనని, రాజకీయాల్ని కాస్త పరిశీలనగా చూస్తే ఎవరికైనా అర్థమయిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మినహాయింపేమీ కాదు. అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. మొదట్లో లైట్ తీసుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. పార్టీలో ఎక్కడా అసంతృప్తి సెగ రేగకుండా, ఎక్కడికక్కడ నేటలతో మంతనాలు జరిపి, వివాదాలు సద్దుమణిగేలా చేయాలని పార్టీ ముఖ్య నేతల్ని ఆదేశించారు.
విశాఖ వైసీపీ రగడ, నిజమెంత.? కల్పన ఇంకెంత.?
విశాఖ జిల్లాకు సంబంధించి విజయసాయిరెడ్డితే పెత్తనం వైసీపీలో. ఆ మాటకొస్తే, వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత పెత్తనమంతా ఒకప్పుడు విజయసాయిరెడ్డి చేతుల్లోనే వుండేది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఆ ‘పవర్’ని పంచుకున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రం విజయసాయిరెడ్డి చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, విజయసాయిరెడ్డితో విభేదిస్తున్నారట. అదీ అసలు సమస్య. దాంతో, ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చిందని అంటున్నారు.
తూర్పున ఫ్యాను రెక్కల్లో అలజడి
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో, జిల్లాకు చెందిన ఓ మంత్రిని పిలిచి, కొండేటి చిట్టిబాబు వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిందిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించారట. తదుపరి విడతలో తనకు మంత్రి పదవి దక్కాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే చిట్టిబాబు వివాదాన్ని రాజేసినట్లు, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే తప్ప, పార్టీ పట్లగానీ, మంత్రుల పట్లగానీ, నిజంగా ఎలాంటి వేరే భావం సదరు ఎమ్మెల్యేకి లేదట.
టీ కప్పులో తుపాను అనుకుంటే పొరపాటే..