Opal Suchata: మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఓపల్ సుచాత.. ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇంటర్నేషనల్ గ్లామర్ ప్రపంచంలో మిస్ వరల్డ్ పోటీ ఒక ప్రత్యేకమైన స్థానం. 2025 సంవత్సరానికి గాను జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ విజేతగా అవతరించారు. ఆమె పేరు ప్రకటించగానే భావోద్వేగంతో కన్నీళ్లకు లోనయ్యారు. ఫైనల్ వేడుకలు వైభవంగా సాగగా, 108 దేశాల నుంచి వచ్చిన అందాల రారాణులతో పోటీ తీవ్రమైంది.

గత ఏడాది విజేత అయిన చెక్ రిపబ్లిక్ బ్యూటీ క్రిస్టినా పిజ్కోవా, ఓపల్‌కు కిరీటాన్ని ఆలంకరించి ఆశీర్వాదాలు అందించారు. ఈసారి పోటీ తీరును బట్టి చెప్పాలంటే, పోలెండ్ బ్యూటీలు బాగా ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్‌గా మిస్ పోలెండ్‌ కంటెస్టెంట్లు నిలిచారు. మూడో రన్నర్ అప్‌గా మార్టినిక్‌కు చెందిన అందగత్తె ఎంపికయ్యారు.

అయితే, ఓపల్ అందం, బౌద్ధిక ప్రతిభ, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోనే కాదు, ఆమె సమాజ సేవా దృక్పథంతోనూ జడ్జిలను ఆకట్టుకుంది. ఈ గెలుపుతో పాటు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీని అందుకోవడం విశేషం. ఫుకెట్‌కు చెందిన ఓపల్ సుచాత ఇప్పటికే తమ దేశంలో మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందారు.

అంతర్జాతీయ వేదికపై తానేంటో నిరూపించుకున్న ఈ విజయం ఆమెకు కొత్త అవకాశాల కిటికీ తలుపులు తెరిచింది. మిస్ వరల్డ్ కిరీటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళా శక్తిని ప్రతిబింబించే ఓ ప్రతినిధిగా ఆమె ఇకపై అనేక కార్యక్రమాల్లో భాగమవుతారు. థాయ్‌లాండ్ వాసులు గర్వించదగ్గ ఘట్టంగా ఈ గెలుపు నిలిచింది.

Public EXPOSED: Ys Jagan Comments On CM Chandrababu || Ap Public Talk || Pawan Kalyan ||TeluguRajyam