ఇండస్ట్రీ టాక్ : మళ్ళీ మిస్ వరల్డ్ తో రజినీకాంత్ భారీ సినిమా.?

తమిళ నాట భారీ స్టార్డం ఉన్న పాన్ ఇండియా హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. మరి ఇపుడు రజిని రేంజ్ హిట్ కోసం పాన్ ఇండియా వీక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే తాను నటించిన లాస్ట్ సినిమా పెద్దన్న భారీ వసూళ్లు అందుకుంది అంటే.. అది కేవలం తమిళ్ లో మాత్రమే మాత్రమే.

మన దగ్గర మాత్రం ఈ చిత్రానికి నష్టాలు తప్పలేదు పైగా పాత చింతకాయ పచ్చడిలా ఉందని ఈ సినిమాపై కామెంట్స్ వినిపించాయి. అయితే రజిని ఇప్పుడు వరకు నటించిన భారీ హిట్ సినిమాల్లో దర్శకుడు శంకర్ తో చేసిన హాలీవుడ్ రేంజ్ ఎంటర్టైనర్ చిత్రం “రోబో” కూడా ఒకటి.

ఆ సినిమాలో రజినీకి హీరోయిన్ గా మిస్ వరల్డ్ అప్పటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించింది. తర్వాత 2.0 లో కూడా కనిపిస్తుంది అనుకున్నారు కానీ అది జరగలేదు. అయితే ఇపుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యినట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

అయితే ఈసారి బీస్ట్, డాక్టర్ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ తో చేస్తున్న సినిమాలో అట. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఐశ్వర్య ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ లో సినిమా పడుతున్నట్టు ఫిక్స్ అయ్యింది. అయితే ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.