మహేష్ గట్టిగానే క్లాస్ తీసుకున్నాడట.!

‘మేమ్ ఫేమస్’ అనే ఓ చిన్న సినిమా ఈ శుక్రవారం ధియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఒకింత మంచి పేరు తెచ్చుకుందిలెండి. అయితే, ఈ సినిమా చూసి మహేష్ బాబు మెచ్చుకున్నాడట.. అంటూ ఓ ట్వీట్ మహేష్ బాబు సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వైరల్ అవుతోంది.

నిజంగానే మహేష్ బాబు ఈ సినిమా చూశాడా.? అని ఆశ్చర్యపోతున్నారు సినీ జనం. అయితే, తూచ్.! ఇదంతా వుత్తదే. మహేష్ బాబు సోషల్ మీడియా హ్యాండిల్‌ని హ్యాండిల్ చేస్తున్న ఛాయ్ బిస్కట్ వాళ్లు మహేష్ బాబు వేసినట్లుగా ఈ ట్వీట్ వేసేశారట.

ఇంకేముంది మహేష్ బాబే ట్వీట్ చేశాడనుకున్నారంతా. అది తెలిసిన మహేష్ బాబు ఛాయ్ బిస్కెట్ వాళ్లకి గట్టిగా క్లాస్ తీసుకున్నాడట. ఈ సినిమాకి ఛాయ్ బిస్కెట్ సమర్పకులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అలా సినిమాకి ఫేమ్ తీసుకురావడానికి మహేష్ ట్విట్టర్ హ్యాండిల్‌ని వాడేశారనీ ప్రచారం జరుగుతోంది. నిజానికి మహేష్ బాబు ఈ సినిమా చూడలేదనీ మాట్లాడుకుంటున్నారు.