నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా తదితరులు.
దర్శకుడు: ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీత దర్శకులు: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
కథ :
‘మాచర్ల నియోజకవర్గం’లో రాజప్ప (సముద్రఖని) ఎన్నో ఘోరాలు చేస్తాడు. అక్కడ అతనికి ఎదురు చెప్పే వారు కూడా ఉండరు. ప్రభుత్వాలు కూడా అతన్ని ఏం చేయలేవు. ఈ క్రమంలో ‘మాచర్ల నియోజకవర్గం’లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా స్వాతి (కృతి శెట్టి) జీవితం ప్రభావితం అవుతుంది. దీనికి తోడు రాజప్ప ద్వారా ‘మాచర్ల నియోజకవర్గం’ లోని ప్రజలు బాధ పెడుతూ ఉంటారు. పైగా ఎలక్షన్సే లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉంటాడు రాజప్ప. మరోపక్క సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ లో టాపర్ గా వచ్చి గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వస్తాడు. అయితే, అప్పటికే స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు సిద్దార్థ్. అసలు స్వాతి ఎవరు ?, రాజప్పకి స్వాతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు సిద్దార్ధ్ రెడ్డి ఏం చేశాడు ?, రాజప్ప అన్యాయాలను ఎలా ఎదిరించాడు ?, చివరకు సిద్దార్థ్ రెడ్డి అనుకున్నది సాధించాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రవేశపెట్టబడిన తీరు చూసి విసుగు వచ్చేస్తోంది. ఆ మాటకొస్తే దర్శకుడు ఏ పాత్రను సరిగ్గా వాడుకోలేదు. అలాగే మంచి కామెడీ నటులను పెట్టుకుని కూడా.. మినిమమ్ కామెడీ పండించలేకపోయాడు దర్శకుడు . సెకండాఫులో ఉన్న కామెడీ ట్రాక్ చూసి నీరసం వస్తోంది. ఆ స్థాయిలో ఉంది అది. మిగిలిన పాత్రధారులంతా ప్యాడింగ్ కి సరిపోయారంతే. మొత్తంగా దర్శకుడు రాజశేఖర్ బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
నితిన్ నటన,
ఎమోషనల్ సీన్స్,
సినిమాలో మెయిన్ పాయింట్,
మైనస్ పాయింట్స్ :
ఓవర్ బిల్డప్ సీన్స్,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
రెగ్యులర్ స్టోరీ,
బోరింగ్ స్క్రీన్ ప్లే,
తీర్పు :
మనసుకి హత్తుకునేలా ఉంటుంది మా సినిమా అని మేకర్స్ ప్రచారం చేశారు. కానీ.. ఈ సినిమా భారీ విసుగుమయం. నితిన్ మాత్రం తన నటనతో మెప్పిస్తాడు. కానీ, సినిమా చాలా సిల్లీగా సాగుతూ బాగా బోర్ కొడుతుంది. యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు కూడా ఈ బోరింగ్ యాక్షన్ డ్రామా నచ్చదు.