బాక్సాఫీస్ రిపోర్ట్ : నితిన్ “మాచర్ల నియోజకవర్గం” డే 1 వసూళ్ల వివరాలు ఇవే..!

టాలీవుడ్ దగ్గర గత వారంలో ఒకేరోజు వచ్చిన రెండు చిత్రాలు “బింబిసార” మరియు “సీతా రామం” లు కూడా భారీ సక్సెస్ అందుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ ఊపిరి పోశాయి. దీనితో ఈ వారంలో వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ని కొనసాగిస్తాయని అంతా ఆశిస్తూ ఎదురు చూసిన మరో చిత్రం “మాచర్ల నియోజకవర్గం”.

దర్శకుడు ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే యూత్ స్టార్ నితిన్ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం మాస్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మంచి ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యింది. దీనితో మంచి ఓపెనింగ్స్ కూడా కన్ఫర్మ్ అని ట్రేడ్ వర్గాల వారు అనుకున్నారు.

అయితే వీటికి తగ్గట్టే సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం మొదటి రోజు 4.70 కోట్ల షేర్ ని రాబట్టగా టోటల్ ఇండియన్ వైడ్ ఈ చిత్రం 5 కోట్ల మేర షేర్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

దీనితో ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఓ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో అయితే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా క్యాథరిన్ కూడా కీలక పాత్ర చేసింది. అలాగే మహతి సాగర్ సంగీతం అందించాడు.