మాచర్ల నియోజకవర్గం మూవీ ఎలా ఉందంటే..

చిత్రం: మాచర్ల నియోజకవర్గం

రేటింగ్ : 3/5

విడుదల : 12, ఆగస్టు -2022

దర్శకత్వం : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి

దర్శకత్వం : నితిన్, కృతి శెట్టి,,సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ

సంగీతం : మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ :ప్రసాద్ మూరెళ్ళ

నిర్మాణం :  శ్రేష్ఠ మూవీస్

నిర్మాతలు : సుధాకర్ రెడ్డి-నిఖితారెడ్డి

కథానాయకుడు నితిన్ విజయాన్ని చవిచూసి  చాలా కాలమే అయింది. చివరిగా ‘భీష్మ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నఆయన ఆ తర్వాత సరైన హిట్టు చూడలేదు. .తాజాగా  ఆయన నటించిన ‘ మాచర్ల నియోజకవర్గం’  సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ రెడ్డి అనే ఒక ఐఏఎస్ పాత్రలో కనిపిస్తాడు.. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో ఆయన కనిపిస్తాడు.. ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నిఖితారెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటించారు.  ‘మాచర్ల నియోజకవర్గం’  ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలకు ముందే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రం  ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది.

నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా అంతా రాజకీయం చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఎన్నికల అధికారిగా నితిన్ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్. మరి ఈ సినేమా ఎలావుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

క‌థ‌:

రాజ‌కీయ ప‌రిణామాల చుట్టూ చిత్రం సాగుతుంది. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రలో నటించాడు.రాజకీయ పరిణామాల చుట్టూ తిరిగే ఈ కథలో దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరుకు జిల్లా కలెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు.అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎలక్షన్స్ జరగకపోవడంతో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితులు గమనించి వాటిని చక్క దిద్దించి ఎన్నికలు జరిపిస్తాడు. అయితే అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు.ఇక ఆయనకు కృతి శెట్టితో పరిచయం ఎలా ఏర్పడుతుంది అనేది మిగతకథ.

విశ్లేషణ :

నితిన్ కలెక్టర్ పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. తొలిసారి డిఫరెంట్ పాత్రతో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆయన సరసన నటించిన కృతి శెట్టి  తన పాత్రతో ప్రేక్షకులమనసు దోచేసింది. తన అందాలతో మతి పోగొట్టింది.ఇక వెన్నెల కిషోర్, మురళి శర్మ, రాజేంద్రప్రసాద్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడమే కాకుండా మంచి కామెడీ తో ఆద్యంతం అలరించారు.

ఈ సినిమాకు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త డైరెక్టర్ గా పరిచయమైన కూడా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా సినిమాను అద్భుతంగా చూపించాడు.ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది.మహతి స్వర సాగర్ అందించిన సంగీతం  బేషుగ్గా ఉంది.  ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ని ఆధారంగా చేసుకొని ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కించ‌గా, మూవీ ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచుతుంది. నితిన్‌కి ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన‌ట్టే

-ఎం.డి. అబ్దుల్