ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఓ రేంజ్ లో రైజ్ అవుతుంది. గడిచిన రెండు వారాల్లో టాలీవుడ్ సినిమాలు నాలుగు రిలీజ్ అవ్వగా వాటిలో ప్రేక్షకాదరణ తో మూడు సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాల్లో “కార్తికేయ 2” లేటెస్ట్ గా సెన్సేషన్ రేపుతుండగా దీనికి ముందు రోజు వచ్చిన మాస్ సినిమా “మాచర్ల నియోజకవర్గం” పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.
యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అవుతుంది అని అంతా ఆశించారు. కానీ ఈ సినిమా మాత్రం ఫైనల్ గా ప్లాప్ ఫలితాన్నే చూడాల్సి వస్తూంది.. మొదటి రోజు ఓపెనింగ్స్ తప్ప అసలు సినిమాకి రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర ట్రేడ్ వర్గాల నుంచి ఊసే లేదు.
ఏదైతే సినిమాకి థియేటర్స్ దక్కలేదో ఆ సినిమానే ఇప్పుడు వండర్స్ చేస్తుంది. దీనితో మాచర్ల సినిమా ప్లాప్ గానే నిలిచిపోగా ఈ సినిమా ఫలితంలో దర్శకుడు ఎ ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉందని సదరు నితిన్ అభిమానులు అంటున్నారు. ఆ దర్శకుడు పర్సనల్ గా చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్స్ వల్ల లాస్ట్ మినిట్ లో మాచర్ల నియోజకవర్గం సినిమాకి చాలా డామేజ్ జరిగింది.
కానీ అనూహ్యంగా సినిమా కూడా అంత క్లిక్ కాకపోవడంతో మరింత స్థాయిలో సినిమాకి దెబ్బ పడింది. దీనితో అయితే నితిన్ ఈ దర్శకుడు ని నమ్మి చాలా తప్పు చేసాడనే చెప్పాలి. దీనితో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో నితిన్ వేసుకున్నాడు. అయితే ఈ సినిమాకి ఎలా లేదన్నా 10 కోట్లకు పైగానే నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా.. ఇంకా ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా క్యాథరిన్ కూడా కీలక పాత్రలో నటించింది.