అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా వున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ‘ప్రభుత్వాలు సంపదను సృష్టించాలి.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అదే. ఆ సంపద నుంచే సంక్షేమ పథకాల్ని చేయగలుగుతున్నాం..’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ, మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్, తనదైన స్టయిల్లో మాటల తూటాలు పేల్చారు.. గారడీ మాటలూ చెప్పారు. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపూ, ‘ఇది నిజమే కదా’ అన్పించడం మామూలే. అంత మంచి మాటకారి ఆయన.
అందర్నీ ఒకేసారి రౌండప్ చేసేసిన కేసీఆర్..
గుజరాతీలు, మలయాళీలు, కన్నడిగులు, తమిళులు.. ఇలా అన్ని రాష్ట్రాలకు చెందినవారూ హైద్రాబాద్ సంస్కృతిలో భాగమైపోయారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అది నిజమే కూడా.! ‘అందరూ ఆలోచించి ఓటెయ్యాలి..’ అని పిలుపునిచ్చారు. ‘అందరం కలిసే వుంటున్నాం.. విద్వేషాలకు తావులేని విధంగా హైద్రాబాద్ వుండాలంటే, తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటెయ్యాలి..’ అని చెప్పుకొచ్చారు కేసీఆర్. ‘ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచించాలి.. ప్రజల్లో చర్చ జరగాలి..’ అని కేసీఆర్ తనదైన మాటల గారడీ చేశారు.
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
గ్రేటర్ ఎన్నికల వేళ కేసీఆర్ ‘ఫ్రీ’ వరాలు చాలానే ఇచ్చేశారు. సెలూన్లకు విద్యుత్ ఫ్రీ.. 20 వేల లీటర్ల లోపు మంచి నీటి వాడకానికి బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు.. ఇలా కొన్ని వరాలు కేసీఆర్ ప్రకటించేశారు. అద్భుతః అనాల్సిందే ఈ ‘ఫ్రీ బీస్’ చూసి. గ్రేటర్ ఎన్నికల వేళ చాలా రాజకీయ పార్టీలు ఈ తరహా ‘ఉచిత’ హామీల్ని ఇచ్చేస్తోన్న విషయం విదితమే.
సంపద ఎక్కడ.? ఈ అప్పుల సంగతేంటట.?
సంపద అంత బావుంటే, అప్పులు చేయాల్సిన అవసరమేంటి.? రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. తెలంగాణకు గుండెకాయ హైద్రాబాద్.. దేశంలోని ప్రముఖ నగరాల్లో హైద్రాబాద్ ఒకటి. ఇక్కడి నుంచి పెద్దయెత్తున ఆదాయం రాష్ట్రానికి వస్తోంది. సంపదలో మనం చాలా మెరుగ్గా వున్నామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం, అప్పుల విషయమై విపక్షాలు ప్రశ్నిస్తే, ఎప్పుడూ తప్పించుకునే ధోరణే. ఆ అప్పుల భారం ప్రజల మీదనే కదా పడేది.!
ఏదిఏమైనా, కేసీఆర్ ప్రెస్‌మీట్ ఒకింత బ్యాలెన్స్‌డ్‌గా సాగిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కేసీఆర్ తన శౖలికి భిన్నంగా సంయమనంతో ప్రెస్‌మీట్ ముగించారు. ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చతున్న వేళ, కేసీఆర్ సంయమనం.. కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.
ఏదిఏమైనా, కేసీఆర్ ప్రెస్‌మీట్ ఒకింత బ్యాలెన్స్‌డ్‌గా సాగిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కేసీఆర్ తన శౖలికి భిన్నంగా సంయమనంతో ప్రెస్‌మీట్ ముగించారు. ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చతున్న వేళ, కేసీఆర్ సంయమనం.. కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.