కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌: నాణానికి అటూ ఇటూ.!

KCR give direct support to farmers

‘దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు.. గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ.. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి..’ అంటూ ఇటీవల గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరుచుకుపడిన విషయం విదితమే. ‘జాతీయ రాజకీయాలపై దృష్టిపెడుతున్నాం.. బీజేపీ, కాంగ్రెస్‌ యేతర రాజకీయ శక్తుల్ని ఏకం చేయబోతున్నాం..’ అని కూడా కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఇంతలోనే, కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళారు.. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమవుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అయితే, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం అనేది సాధారణమైన విషయమే. దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అయితే, మూడు రోజుల కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో చాలా ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి.

KCR give direct support to farmers
KCR give direct support to farmers

ఏపీ అలా, తెలంగాణ ఇలా.!

పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. మరోపక్క, కేసీఆర్‌ కూడా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షశ్రీకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగిందట. అయితే, పోలవరం విషయమై తెలంగాణ నుంచి కొంత పంచాయితీ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్‌కి. ఈ భేటీలో పోలవరం అంశం కూడా కేసీఆర్‌ ప్రస్తావనకు తెచ్చారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై ఏపీ ముఖ్యమంత్రితో తాను మాట్లాడినట్లు గతంలో కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ, పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించేది లేదని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేయడం గమనార్హం.

ఢిల్లీలో ఆందోళనలు చేస్తోన్న రైతులకు ప్రత్యక్ష మద్దతునిస్తారా.?

ఇటీవల భారత్‌ బంద్‌ జరిగితే, ఆ బంద్‌కి తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతిచ్చింది. మంత్రులు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు సహేతుకమైనవి కావన్నది కేసీఆర్‌ వాదన. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్‌లో కేసీఆర్‌, ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాల నాయకుల వద్దకు వెళతారా.? వారితో భేటీ అవుతారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రధానితో భేటీ.. సాధ్యమేనా.!

గ్రేటర్‌ ఎన్నికల వేళ బీజేపీ – టీఆర్‌ఎస్‌ మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్‌ భేటీ అవుతారా.? భేటీ అయితే, ఈ సందర్భంగా ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి.? అన్నది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్‌ని కాదని, గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి బీజేపీ మద్దతు లభిస్తేనో.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ మారిపోవడానికి పెద్దగా సమయం అక్కర్లేదు మరి.