నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ప్రస్తుతం జగన్ ఆలోచనలనే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుంది. ఇంతకు మించిన దౌర్భాగ్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి కాసేపు పక్కన పెడితే… ఏపీలో జగన్ స్ట్రాటజీలను తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు చంద్రబాబు & కో!
అవును… తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన టీడీపీని తిరిగి బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారంట. తెలంగాణలో ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని నమ్ముతోన్న బాబు.. అన్నీ అనుకూలంగా జరిగితే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీని సిద్ధం చేయనున్నారంట. ఇందులో భాగంగా.. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించిన సంగతి తెలిసిందే!
ఆ సంగతులు అలా ఉంటే… ఏపీలో జగన్ సర్కార్ కి ఫుల్ మార్కులు తెచ్చిపెట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని యాజ్ టీజ్ గా కాపీ కొట్టి తెలంగాణ రాజకీయాల్లో పేస్ట్ చేయాలని నిర్ణయించారంట బాబు! కాకపోతే “ఇంటింటికీ తెలుగుదేశం” అని పేరు మార్చారు అంతే! ఈ కార్యక్రమంలో కూడా.. ప్రతీ ఇంటికి వెళ్లి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయనున్నారట టి.తమ్ముళ్లు!
దీంతో… చంద్రబాబు మరీ ఇలా డైరెక్ట్ గా జగన్ ఆలోచనలను కాపీ పేస్ట్ చేయడం తమకు తలవంపులుగా ఉందని టి.తమ్ముళ్లు ఫీలవుతున్నారంట. ఏది ఏమైనా… తెలంగాణ టీడీపీని ఆల్ మోస్ట్ అనాదగా వదిలేశారనే కామెంట్ల నడుమ.. బాబు తన చివరి ప్రయత్నంగా ఇక్కడ కూడా ఒక ప్రయత్నం చేయడం గొప్ప విషయమే అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!