వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఎప్పకప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నాయి. జగన్ సామాజిక వర్గాన్ని అందలం ఎక్కించడం ఏంటని? ఎప్పటికప్పుడూ విష ప్రచారంతో ఆ రెండు పత్రికలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి జగన్ ప్రధాన ప్రతిపక్షంగా మారడంతో విష ప్రచారం మరింతగా పెట్రేగిపోయింది. 2009 నుంచి జగన్ పై త్రాచు కోరలు చాచి విషం చిమ్మినట్లు చెడు ప్రచారాన్ని పీక్స్ లో చేసాయి. ఇప్పటికీ అదే తంతు లో కొనసాగుతున్నాయి. అయినా జగన్ ఏ రోజు వాటిని పట్టించుకున్నది లేదు. పళ్లున్న చెట్టుకే రాళ్లు అన్న చందంగా ఎలాంటి ప్రచారానికి దిగినా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి..అధికారంలో ఉన్నది వైకాపా అని తెలిసినా ఆ రెండు పత్రికలు ఇంకా పాత ఒరవడిలోనే కొనసాగుతున్నాయి. జగన్ కి అధికారం రావడంతో ఆ రెండు పత్రికలు అక్కసాన్ని మరింతగా వెళ్లగక్కుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పత్రికలపై కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం వేసిన పిటీషన్ కు అనుకూలంగా వార్తల విషయంలో మీడియా సంస్థలు హద్దు మీరుతున్నాయని ఇటీవలే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఆ రెండు పత్రికలు ఇటీవల కాస్త దూకుడు తగ్గించాయి.
తాజాగా ఆ రెండు పత్రికాధినేతలపై జగన్ వేటుకు రంగం సిద్దం చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చకొచ్చింది. సరస్వతి ఇండస్ర్టీస్ కు మంజూరు చేసిన మైనింగ్ లీజ్ లో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని కొన్ని రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం మొదలు పెట్టాయి. పత్రికాహక్కులను కాలరాసి ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బ తీసేలా వ్యవహరించాయి. తాజాగా దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ రెండు పత్రికలపై చర్యలకు రంగం సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పత్రికా యజమానులు దిగొచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. సరస్వతి ఇండస్ర్టీస్ విషయంలో ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చినా ఆ రెండు పత్రికలు ప్రజలను తప్పుడు దోవ పట్టించేలా కథనాల్ని ప్రసారం చేసాయని పేర్కొన్నారు. దీంతో ఆ రెండు పత్రికాధినేతలకు మూడినట్లే! అన్న ప్రచారం మీడియా సర్కిల్స్ లో జరుగుతోంది.