ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ లో 151 స్థానాలు, లోక్ సభలో 22 స్థానాలు కైవసం చేసుకుని ఓ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. సరిగ్గా మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వైకాపా అధినేత జగన్, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో మునిగిన ప్రత్యేకమైన రోజు అది. జగన్ శ్రమ, కృషి, పట్టుదల నెగ్గిన రోజు అది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ యంగ్ సీఎంగా చరిత్రకు ఎక్కిన రోజు అది. అయితే సరిగ్గా నేటికి(శనివారం 2020 మే 23కి) ఏడాది పూర్తయింది.
దీంతో సోషల్ మీడియా వేదికగా జగనన్న రాజకీయ చరిత్రలో గుర్తపుపెట్టుకునే రోజు అంటు అభిమానులు, కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. రాక్షస పాలన అంతమై…రాజన్న పాలన వచ్చిన రోజు అంటూ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. రాజన్న బిడ్డ, జనహృదయనేత, యంగ్ సీఎం అంటూ జగన్ ని ప్రశంసిస్తున్నారు. విశ్వసనీయతకు పట్టం కట్టి నేటికి ఏడాదంటూ కొన్ని వీడియో క్లిపింగ్ లను సోషల్ మీడియాలో వదిలారు. అవి ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్, యూ ట్యూబ్ మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆ విషయం పక్కనబెడితే జగన్ ఏడాది పాలన పై జనాలు ఏమంటున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరం. జగన్ పాలనపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పాలన విషయంలో ఆరంభంలో కాస్త తడబడినా ఇప్పుడు అన్నింటిని ఒక్కొక్కటిగా మ్యానేజ్ చేసుకుంటూ వస్తున్నారని ఉత్తరాంధ్ర వాసులు, రాయలసీమ సహా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి వాసులు అభిప్రాయపడ్డారు. ఒక్క అమరావతి రాజధాని పెయిడ్ ఆర్టిస్టులు తప్ప రాష్ర్టమంతా జగన్ ఏడాది పాలనపై జేజేలు కొడుతోంది. ఎన్నికల హామీలంటే కేవలం మాటల వరకే పరమితయ్యేవి ఇన్నాళ్లు…కానీ జగన్ ఆ మాటను తిరగరాసాడు. మాట తప్పడు…మడం తిప్పడు అన్న దానికి జగన్ నిలువెత్తు నిదర్శనం అంటూ ప్రశంసిసతున్నారు. ఇచ్చిన వాగ్ధానాన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారని…ఇది పేద, బడుగు, బలహీన, రైతు వర్గాల రాజ్యం కాక ఇంకెవరిదంటూ జగన్ పనితనాన్ని కీర్తిస్తున్నారు. లాక్డౌన్ లాంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జగన్ పై మెజార్టీ పీపూల్స్ అభిప్రాయపడ్డారు.