Nadendla Manohar: వైసీపీ హయాంలో రైతులకు అన్యాయం.. కూటమి వచ్చాకే భరోసా: మంత్రి నాదెండ్ల ఫైర్

Nadendla Manohar: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. వైసీపీ పాలనలో రైతులను నిలువునా ముంచి, దళారుల వ్యవస్థను ప్రోత్సహించిన చరిత్ర జగన్‌దని, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టామన్నారు.

Sajjala Ramakrishna Reddy: 16న గవర్నర్‌కు కోటి సంతకాలు.. లక్ష్యం మించి స్పందన: సజ్జల

Kalvakuntla Kavitha: తెలంగాణ అమరుడి పేరు ఒక్క ప్రాజెక్టుకైనా పెట్టారా?: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత సూటి ప్రశ్న

ప్రభుత్వం ఏర్పడిన కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.3,350 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని గర్వంగా తెలిపారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు 50 వేల టార్పాలిన్లను ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి రైతు సహాయక కేంద్రంలో 30 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను గణాంకాలతో సహా వివరించారు. వైసీపీ ప్రభుత్వం 2023-24లో కేవలం 5.22 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే, తాము ఈ ఏడాది ఇప్పటికే 14 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు.

తాము నేరుగా 6.97 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని, వైసీపీ హయాంలో దళారులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ‘దీపం-2’ పథకం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మనోహర్ ఎద్దేవా చేశారు. తాము ఇచ్చిన హామీ మేరకు అర్హులైన 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఇందుకోసం రూ.2,406 కోట్లు ఖర్చు చేశామని లెక్కలతో సహా వివరించారు.

తుపాన్ల సమయంలో ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌కు, క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కల్యాణ్‌కు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. వైసీపీ పాలనలో రైతులు పడిన ఇబ్బందులను ప్రజలు మర్చిపోలేదని, వాస్తవాలను గ్రహించి నిర్ణయం తీసుకోవాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు.

కాపులకు దిష్టి || Producer Natti Kumar About KAPU Leaders || Pawan Kalyan || Chiranjeevi || TR