YSRCP : వైసీపీకి ‘పొత్తు’ ఆలోచన వుందా.?

YSRCP : తాము ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి వేరే పార్టీల మద్దతు అవసరం లేదు. ఒకవేళ అవసరం వచ్చినా వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఏ పార్టీ కూడా మద్దతివ్వదు. అలాంటప్పుడు పొత్తుల ప్రస్థావన వైసీపీ నేతల్లో ఎందుకు వస్తోంది.?

మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నారో లేదో కూడా అర్ధం కావడం లేదు అంటూ.. ఎద్దేవా చేశారు మంత్రి బొత్స.  ప్రజలకు పనికొచ్చే మాటలేవీ పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం లేదని కూడా విమర్శించారాయన.

ఇదిలా వుంటే, బొత్స సత్యనారాయణ పొత్తుల ప్రస్థావన తీసుకొచ్చారు. పొత్తులు అవసరం అనుకుంటే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారంటూ ఆసక్తికరమైన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సీనియర్ మంత్రి.

అసలు పొత్తుల ప్రస్థావన ఎందుకు తెచ్చినట్లు బొత్స.? బొత్స సీనియర్ పొలిటీషియన్. రాష్ర్టంలో పరిస్థితులు ఆయనకు తెలుసు. వైసీపీకి వేరే పార్టీల మద్దతు వుండదనీ, ఆ అవసరం లేదని కూడా తెలుసు. తెలిసీ పొత్తుల ప్రస్థావన తెచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోంది. జరుగుతోందో లేదో ఆ అనుమానాలకయితే ఆస్కారమిచ్చేశారు బొత్స.

సీనియర్ మంత్రి బొత్స వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయ్. వైసీపీ వర్గాల్లో ప్రకంపనలకు కారణమయ్యాయ్.