తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లా సంతోష్ బాబు విషయంలో స్పందించిన తీరు నిజంగా రాష్ర్టాలకు ఆదర్శమనే చెప్పాలి. 5 కోట్లు ఆర్ధిక సహాయం..సంతోష్ బాబు భార్యకు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగం..నివాస స్థలం ఏర్పాటు చేయడం అన్నది నిజంగా గొప్ప విషయం. భారతదేశం పై సీఎం తన ప్రేమని ఇలా చాటుకున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. సొంత రాష్ర్టానికి చెందిన వ్యక్తి కావడంతోనే కేసీఆర్ భారీ స్థాయిలో సహాయం ప్రకటించినట్లు హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సహాయాన్ని కేసీఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికెళ్లి అందించనున్నారు. అలాగే అదే చైనా ఘర్షణ లో అమరులైన 19 మంది ఇతర రాష్ర్టాల వారికి కేసీఆర్ 10 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. దక్షిణాది రాష్ర్టాలన్నీ ఈ విషయంలో సైలైంట్ గా ఉన్నా కేసీఆర్ మాత్రం చొరవ చూపించడం ఆదర్శమనే చెప్పాలి.
ఈ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి చేతుల మీదుగా అందించాలని నిర్ణయించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతున్నా, ఇందులో రాజకీయణ కోణం కూడా ఉందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తొలి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీపై కేసీఆర్ అండ్ కో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదోక ప్యాకేజీనా..ఎవరికి ఉపయోగం అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల్ని కేంద్రం కూడా సీరియస్ గానే తీసుకుంది. లో లోపల ఎంత బాధ ఉన్నా చాలా రాష్ర్టాల సీఎంల దింగమింగినా కేసీఆర్ మాత్రం ఓపెన్ అయిపోయవడం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో చర్చకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం వర్సెస్ కేసీఆర్ అన్నంతగా తెలంగాణ సీఎం పేరు వైరల్ అయింది.
ఆ వెంటనే కరోనా టెస్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టులకు, కేంద్రానికి దొంగ లెక్కలు చెబుతూ మభ్య పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం సహా..హైకోర్టు మండిపడింది. ఈ విషయంలో కేంద్రంలో అదిష్టానం కూడా కేసీఆర్ సర్కార్ పై గుర్రుగానే ఉందని జోరుగా ప్రచారం సాగింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లు కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తు నిరసనలు తెలిపారు. దీంతో కేసీఆర్ ఒక్కసారిగా దూకుడు దక్కించారు. ప్రభుత్వ డాక్టర్లు అడిగిన డిమాండ్లను దిగొచ్చి నెరవేర్చారు. ప్రతీ విషయంలోనూ మొండిగా వెళ్లే కేసీఆర్ ఆ సన్నివేశంతో స్పీడ్ తగ్గించినట్లే కనిపించింది.
తాజాగా ఆర్ధికంగా రాష్ర్టాల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇతర రాష్ర్టాల సైనికులకు కేసీఆర్ 10 లక్షల సహాయం ప్రకటించడం..ఆ మొత్తాన్ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఇప్పిస్తాననడం వంటివి క్యాడర్ కి కవ్వింపు చర్యలంటూ ఆరోపణలొస్తు న్నాయి. ఇందులో రాజకీయ కోణం కూడా ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై దూకుడు చర్య మంచిది కాదని కేసీఆర్ ఆలస్యంగా తెలుసుకున్నట్లు కథనాలు వేడెక్కిస్తున్నాయి. ప్రధాని మోదీతో జరిగిన అఖిల పక్ష భేటీలో కేసీఆర్ స్వరం కాస్త కవ్వింపుగానే ఉందని అంటున్నారు.