పాపం. చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒక రోజు ముందు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పెద్ద హంగామా సృష్టించారు. ఎపిలోనే కాకుండా తెలంగాణలో కూడా తనకు ఎదురు లేదని కాంగ్రెసు అధికారంలోని తనవలెనే వస్తుందనే వాతావరణం సృష్టించారు. తెలంగాణలో తను సృష్టించే ప్రభంజనం చూపెట్టి2019లో ఎపిలో ప్రభుత్వం వ్యతిరేకతను అధికమించాలని బలమైన సవాళ్లు ఇస్తున్న ప్రతి పక్షాలను నిలువరించాలని ప్రధాని మోడి వ్యతిరేక ఫ్రంట్ తన వలనే సాధ్యం మని పన్నిన వ్యూహం తీరా 12 గంటలు గడవక ముందే అంతా తలకిందులు అయింది. తెలంగాణలో కెసిఆర్ అధికారం చేజిక్కించు కొన్నారు.2014 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ – కాంగ్రెస్ అధికార ప్రతి పక్షాలుగా సాగు తుండిన రాజకీయ పోరాటం ఎన్నికలు వచ్చే సరికి కెసిఆర్ – చంద్రబాబు ల మధ్య పోరాటంగా మారి పోయింది. ఫలితంగా కెసిఆర్ కు గెలుపు సులభమైనది.
తెలంగాణ
ఎన్నికలు ముగిసి ఎగ్జిట్ పోల్స్ లో లగడపాటిని మినహా ఇస్తే మిగిలిన అందరూ కెసిఆర్ గెలుపొందే అవకాశాలు వున్నాయని ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ గెలుపుకు సహకరించిన అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర మధనం ప్రారంభమైంది. ఎందుకంటే తెలంగాణకు కెసిఆర్ పెద్దగా ఒరగ బెట్టిందేమీలేదు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేశారు. పైగా కుటుంబ పాలన అనే అపప్రథ మాట గట్టు కున్నారు. ఉద్యమం సమయంలోనూ 2014 ఎన్నికల సమయంలోనూ చేసిన వాగ్దానాలు పూర్తిగా అమలు చేయలేదు. ఉద్యమంలో త్యాగం చేసిన వారు విస్మరింప బడ్డారు.ఫలితంగా తెలంగాణ సెంట్ మెంట్ సజీవంగా వుండే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు కొదవ లేదు. ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోవడమే ఇందుకు నిదర్శనం. కాకుంటే విద్యుత్ సరఫరా మెరుగు పడటం రైతుబంధు పథకం అమలు- అదికూడా భూస్వాములకే మేలుజరిగిందనే విమర్శల మధ్య ఎన్నికలు జరిగాయి.
అయినా తుదకు జాతీయ మీడియా ప్రకటించిన ఫలితాలే వాస్తవం కావడంతో లగడపాటి సర్వే తేలిపోయింది.కెటిఆర్ ఆపాదించిన ప్రకారం లగడపాటికి స్వంత ప్రయోజనాలు లేనిదే ఇంత హంగామా చేయరనేది ప్రస్తుతం చర్చనీయాంశంకాదు. అయితే ఇంత మాజిక్ ఏలా సంభవించింది.?పోలింగ్ తర్వాత కూడా కాంగ్రెసు నాయకులు మేక పోతు గాంభీర్యం లాగా కాకుండా నిజంగా గెలుపొందుతామనే ధైర్యంతో ప్రకటనలు చేశారు.ఈ సందర్భంలో కెటిఆర్ ఒక్క రే గెలుపు గురించి నొక్కి చెబుతూ చంద్రబాబు ప్రవేశంతో ఇది సాధ్యం అయిందని చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా వచ్చిన సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజల్లో కెసిఆర్ రగిలించిన సెంట్ మెంట్ బాణం బాగా పనిచేస్తుందని అదొకటే కెసిఆర్ ను కాపాడుతుందనిముందుగా భావించిన వారు లేక పోలేదు. తుదకుఅదే నిజం అయింది.
ఎందుకిలా జరిగింది.? తెలంగాణ ఉద్యమం నాటి చంద్రబాబు వ్యతిరేకత తెలంగాణలోఇంకా మిగిలే వుందని మరోమారు వెల్లడయింది. తెలంగాణ సెంటిమెంట్ కన్నా చంద్రబాబు వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది. అందుకే 2014 ఎన్నికల్లోకూడా సెటలెటరులు వున్న ప్రాంతాల్లోనే టిడిపి అభ్యర్థులుగెలుపొందారు. ఓటుకు నోటు కేసు ఉమ్మడి రాజధాని వదలి పెట్టడంతో వారిలోకూడా అభిప్రాయాలు మారాయి. చంద్రబాబు టిడిపియెడల వారిలో కూడా నమ్మకం పోయింది. ఫలితంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ చేదు నిజంను చంద్రబాబు గుర్తించక పోవడంతో ప్రస్తుతం కొంప ముంచింది.తను ఎవరినైనా మేనేజ్ చేయగలననే ధీమా నేతల అంశంలో నిజం కావచ్చు నేమో గాని ఓటర్లను మెప్పించడంలో సాధ్యం కాదని ప్రస్తుతం చంద్రబాబు కు తెలిసి వచ్చి వుండాలి. అంతేకాకుండా చంద్రబాబు – కెసిఆర్ మధ్య సామరస్యం కొరవడినందున రెండు రాష్ట్రాల మధ్య తుదకు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఆంధ్ర పక్ష పాతి అనే ముద్ర ఆలాగే మిగిలి పోయింది. అయినా చంద్రబాబు ఈ అంశాలేవీ పరిగణన లోనికి తీసుకోకుండా రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని గతంలో ఘోరంగా విఫలమైన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లే వేస్తూ తిరిగి ఎన్నికల ప్రచార బాధ్యత తనపై వేసుకోవడంతో తను మునగడమే కాకుండా అవసరం కొద్దీ స్నేహ హస్తం ఇచ్చిన కాంగ్రెస్ తో కలసి ఇద్దరు మునిగారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇంతగా పూసుకోకుంటే చంద్రబాబు వ్యతిరేకత స్థానంలో ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కు ఒక మేరకైనామంచి ఆయుధంగా ఉపయోగపడేది.కెసిఆర్ చేసిన తప్పులే ప్రజల ముందు చర్చ జరిగేది. కాంగ్రెస్ లేవ నెత్తిన అక్రమ అవినీతి పాలనకుకెసిఆర్ జవాబు చెప్పాల్సి వుండేది. కానిచంద్రబాబు శిఖండి లాగాకెసిఆర్ కు ఉపయోగ పడి పదునైన ఆయుధంలా మిగిలారు. చంద్రబాబు వ్యతిరేక సెంట్ మెంట్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత తలవంచింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సంధించిన అవినీతి కుటుంబ పాలన వాగ్దానాల భంగం తదితర అంశాలపై కెసిఆర్ జవాబు చెప్పుకోలేక ప్రజలు మెప్పించలేక తడ బడే దుస్థితి తప్పింది. చంద్రబాబు ప్రవేశంతో కెసిఆర్ ఎదురు దాడికి దిగి కాంగ్రెస్ సంధించేదెబ్బల నుండి సులభంగా తప్పించుకున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా తన ప్రచార బాణాలు చంద్రబాబు పై గురి పెట్టి ప్రజలను మెప్పించడంతో గెలుపు గుర్రం ఎక్కారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడాగట్టి యత్నం చేసింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ప్రజల లోనికి తీసుకెళ్లారు. సోనియా గాంధీ ప్రసంగంకూడా మెప్పించే విధంగా వుండినది. రాహుల్ గాంధీ కూడా ప్రజలను మెప్పించే విధంగా మాట్లాడినారు. ఇంకేం? ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలదని అధికారం దక్కుతుందని కాంగ్రెస్ నేతలు సంబర పడ్డారు.
కాంగ్రెస్ నేతలు కెసిఆర్ పై ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా కెసిఆర్ మాత్రం సెంట్ మెంట్ చంద్రబాబు పెత్తనంపైననే తన ప్రసంగాలు సాగించడం పై చాల మంది కి అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబు వ్యతిరేక సెంటిమెంట్ ఎంత వరకు పని చేస్తుందని సందేహించిన వారు వున్నారు. . కాని చంద్రబాబు వ్యతిరేక సెంట్ మెంట్ కెసిఆర్ కు బాగా ఉపయోగ పడింది. చంద్రబాబు ను టార్గెట్ చేయడంలోనే నిమగ్నమై విజయం సాధించారు.లేకుంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మరో నైజాం లాగా ఫాంహౌస్ కు ప్రగతి భవన్ కు పరిమితమై సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా అప కీర్తి మూట కట్టు కున్న నేపథ్యంలో ఏదో ఒక కీలకమైన అంశం వుండ బట్టే కెసిఆర్ ను గట్టుకు చేర్చింది. వీటికి తోడు మరో రెండుమూడు అంశాలు కెసిఆర్ కుతోడైనవి. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ లో రాజశేఖరరెడ్డికిమంచి ఫాలోయింగ్ వుంది. రాజశేఖరరెడ్డిపై విమర్శలు జరిగినా వైసిపి బహిరంగంగా ప్రకటించకున్నా చంద్రబాబు ప్రవేశంతోో టిఆర్ఎస్ కు ఓటు వేశారు.సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వెంట వుంటుందని భావించబడినా ఎపి మూలాలు ప్రధానంగా సీమలో వైసిపికి చెందిన వారు టిఆర్ఎస్ కు ఓటేయడం కొస మెరుపు.
ఈ పుణ్యం చంద్రబాబు కట్టుకున్నారు. దీనికి తోడు జన సేన శ్రేణులు టిఆర్ఎస్ వెంబడి నడిచాయి. వాస్తవంలో కెసిఆర్ ది ఒంటరి పోరుగా పైకి కనిపించినా చంద్రబాబు వ్యతిరేక శక్తులు ప్రధానంగా రాయలసీమ వాసులు ఎక్కువ మంది టిఆర్ఎస్ కు ఓటు వేశారు. . ఎప్పుడైతే చంద్రబాబు తన ఎన్నికలుగా బరిలో దిగారో తెలంగాణ ప్రజల్లో కెసిఆర్ యెడల వ్యతిరేకత వున్నా పక్కదారి పట్టింది. . అదే సమయంలో నిద్రాణమైన పలు వ్యక్తులు గ్రూపులు రంగ ప్రవేశం చేయడంతో టిడిపి తో పాటు కాంగ్రెస్ కొంప మునిగింది. ఇదిలావుండగా….ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి పోకుండా కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టిన కూటమి విఫలమైంది.ఈ కూటమికి కేవలంఅధికారం కెసిఆర్ వ్యతిరేకత ప్రాతి పదిక తప్ప కూటమిలోని పార్టీల మధ్య ప్రజల సమస్యల యెడల ఇటీవల వరకు ఏకీభావం లేదు. నిన్న మొన్నటి వరకు ఉత్తర దక్షిణ ధృవాలుగావుండి కేవలం అధికారంకోసం కాంగ్రెస్ టిడిపి కలిశాయి. పైగా టిఆర్ఎస్ తో సఖ్యతకు యత్నం చేసి విఫల మైనటు స్వయంగా చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించి తుదకు కాంగ్రెస్ తో జట్టు కట్టడాని తెలంగాణ ప్రజలు అంగీకరించ లేదు. పచ్చి అవకాశ వాదంగా తెలంగాణ ప్రజలు భావించారు. .మోడి కెసిఆర్ వ్యతిరేకత తప్ప మిగిలిన ఏ అంశంలోనూ కాంగ్రెస్ టిడిపి మధ్య సారూప్యం లేదు. కెసిఆర్ మోడీ ఒకటేనని చంద్రబాబు కాంగ్రెసు నేతలు ఎంత మొత్తుకునా అది పని చేయలేదు. రేపు ఎపిలోమోడికి జగన్ కు పవన్ కు లింకు పెట్టి చంద్రబాబు చేసే ప్రచారం పనిచేయదని కూడా తెలంగాణ ఎన్నికలు తేల్చేశాయి. ఈ లాంటి కూటములు కేవలం అధికారం కోసం తప్ప ప్రజల సమస్యల పరిష్కారంలో ఒక దశలో నిలబడవనే భావన తెలంగాణ ప్రజలు భావించడంతో ఈ తీర్పు వచ్చిందని భావించాలి.
పైగా ఓటింగ్ వివరాలు పూర్తిగా అధ్యయనం చేస్తే గాని కూటమి లోని పార్టీల ఓట్లు ఒకరి కొకరికిబదలీ అయినది లేనిది తేలుతుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి సెంటిమెంట్ గత నాలుగేళ్ల కెసిఆర్ పాలన చేదు అనుభవాలతో పలుచ బడి వుండ వలసింది. ఉద్యమం నాటి పుండుమానుతూ వున్న దశలో చంద్రబాబు ప్రవేశంతో మాను తున్న గాయానిని తిరిగి సెంట్ మెంట్ తో కెసిఆర్ చక్కగా కెలికి తన విజయం సాధించారు . ఈ ప్రచారం ఎంత వరకు వెళ్లిందంటే చంద్రబాబు అండతో కాంగ్రెస్ అధికారానికి వస్తే తిరిగి సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేస్తారని ప్రజలు నమ్మ బలికేటు చేశారు. పలు అననుకూల పరిస్థితిలో నువ్వా నేనా అనే పద్దతిలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక తట్టుకొని కెసిఆర్ నిలబడినారు. ఈ క్రెడిట్ చంద్రబాబు కు దక్కుతుంది.
(వి. శంకరయ్య , రాజకీయ వ్యాఖ్యాత 9848394013)