Indian Railways: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త!

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. చర్లపల్లి – తిరుపతి వీక్లీ స్పెషల్
రైలు నెం. 07011 (చర్లపల్లి నుంచి తిరుపతికి): సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.
రైలు నెం. 07012 (తిరుపతి నుంచి చర్లపల్లికి): సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: మల్కాజ్‌గిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, కర్నూలు సిటీ, గుత్తి, కడప, రేణిగుంట.

2. తిరుపతి – హిసర్‌ వీక్లీ స్పెషల్
రైలు నెం. 07717 (తిరుపతి నుంచి హిసర్‌కు): అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు ప్రతి బుధవారం బయలుదేరుతుంది.
రైలు నెం. 07718 (హిసర్‌ నుంచి తిరుపతికి): అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
ప్రధాన స్టేషన్లు: రేణిగుంట, కడప, కర్నూలు సిటీ, కాచిగూడ, నిజామాబాద్‌, నాందేడ్‌, అకోలా, భుస్వాల్‌, వడోదర, రత్లం, అజ్మీర్‌.

3. నాందేడ్‌ – ధర్మవరం వీక్లీ స్పెషల్
రైలు నెం. 07189 (నాందేడ్‌ నుంచి ధర్మవరం): సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.
రైలు నెం. 07190 (ధర్మవరం నుంచి నాందేడ్‌): సెప్టెంబరు 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్లు, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి.

4. బెంగళూరు – బీదర్‌ స్పెషల్ సర్వీసులు
రైలు నెం. 06549/06550: బెంగళూరు నుంచి ఈనెల 26న, బీదర్‌ నుంచి 27న ఒక్కో ట్రిప్పు నడుస్తాయి.
రైలు నెం. 06530/06540: సెప్టెంబరు 5 నుంచి 29 వరకు ఈ రైళ్లు శుక్ర, ఆదివారాల్లో బెంగళూరు నుంచి, శని, సోమవారాల్లో బీదర్‌ నుంచి నడుస్తాయి.
ప్రధాన స్టేషన్లు: యల్హంక, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, రాయచూరు, వాడి, కలబురగి.

5. యశ్వంతపూర్‌ – ధన్‌బాద్‌ వీక్లీ స్పెషల్
రైలు నెం. 06563 (యశ్వంతపూర్‌ నుంచి ధన్‌బాద్‌): ఈ నెల 23 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
రైలు నెం. 06564 (ధన్‌బాద్‌ నుంచి యశ్వంతపూర్‌): ఈ నెల 25 నుంచి డిసెంబరు 29 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, కాచిగూడ, ఖాజీపేట్‌, బాలార్షా, నాగపూర్‌, ఇటార్సి, ప్రయాగరాజ్‌, గయ.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రయాణ తేదీలకు అనుగుణంగా ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను సంప్రదించగలరు.

చంద్రబాబు పాలన శూన్యం || Analyst Ks Prasad EXPOSED Chandrababu Ruling || DL Ravindra Reddy || TR