పాకిస్థాన్ తాలూకు ఉగ్రవాద మద్దతు వ్యవహారంపై భారత్ అంతర్జాతీయంగా బలమైన ప్రతిస్పందనకు సిద్ధమవుతోంది. ఇటీవల కశ్మీర్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన పహల్గామ్ దాడిని అంగీకరించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను ఐక్యరాజ్యసమితి భద్రతా ముందు ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిందిగా భారత్ అధికారికంగా ప్రస్తావించనుంది.
ఈ మేరకు యూఎన్ ఎస్‌సీకి భారత్ నుంచి ప్రతినిధి బృందం వెళ్లనుంది. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని, 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్‌లో టార్గెట్ హత్యలు, ఆర్మీపై దాడులు, ఆయుధాల అక్రమ రవాణా, యువతను ఉగ్రవాద వైపు లాగే ప్రయత్నాల్లో నిమగ్నమైందని దృవంగా వెల్లడించనుంది.
ఇందుకు సంబంధించి ఆధారాలను ఇప్పటికే భారత్ సమీకరించింది. టీఆర్ఎఫ్ పహల్గామ్ దాడికి స్వయంగా బాధ్యత తీసుకోవడం, రెండు వేర్వేరు విడియోల్లో తమ ప్రమేయాన్ని అంగీకరించడం పాక్ మద్దతును మరింత బహిరంగంగా పెడుతుంది. అయినప్పటికీ పాకిస్థాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా, టీఆర్ఎఫ్ పేరు యూఎన్ ప్రకటనలో ఉండకుండా అడ్డుకుందన్నది మరో కీలక అంశం.
వచ్చే వారం సమావేశంకానున్న ఐసిల్ – అల్ ఖైదా ఆంక్షల కమిటీలో ఈ అంశంపై చర్చ జరగనుంది. ఇందులో టీఆర్ఎఫ్‌ను అధికారికంగా ఉగ్ర సంస్థగా గుర్తించాలనే భారత్ డిమాండ్‌ను చురుకైన దేశాలు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవేళ అంగీకారం లభిస్తే… టీఆర్ఎఫ్ కార్యకలాపాలపై ఆంక్షలు, ఆర్ధిక నిషేధం, సభ్యులపై ప్రయాణ నిషేధాలు అమలులోకి వస్తాయి.
ఇది పాకిస్థాన్ మద్దతు ముసుగును చీల్చే మార్గమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ కౌంటర్ దౌత్యం ఇప్పుడు తీవ్రంగా స్పష్టమవుతోంది.