భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరిన దశలో, అణు యుద్ధం ముప్పును నివారించడంలో అమెరికా పాత్రపై తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన పదవీకాలంలో రెండు అణ్వాయుధ దేశాలను ఒకే టేబుల్ వద్దకి తెచ్చిన దౌత్య నైపుణ్యం గురించి ట్రంప్ వివరించగా, ఇది ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
“ఆ సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితి అతి ప్రమాదకరంగా మారింది. రెండు దేశాలూ తీవ్ర పోరుకు సిద్ధమయ్యాయి” అని గుర్తు చేసిన ట్రంప్, ఇలాంటి సంక్షోభ సమయంలో శాంతి చర్చలకు ప్రేరణ ఇచ్చేందుకు వాణిజ్య అవకాశాలే ప్రధాన హథియంగా వాడినట్టు తెలిపారు. “మీరు శాంతిస్తే, అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందాలు సాధ్యమవుతాయి” అనే మాటల వల్లే పరిస్థితిని తిరగరాసినట్టు వివరించారు.
ఒకవైపు భారత్, మరోవైపు పాకిస్థాన్, రెండు ప్రభుత్వాలూ ఆ సమయంలో శక్తివంతమైన నాయకత్వం చూపించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాత్మక దశలో తీసుకున్న నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయని చెప్పారు. ఒకవేళ ఆ సమయంలో దౌత్య మార్గం అసంతృప్తికరంగా మారి ఉంటే, అణు ఘర్షణ ఆపడం అసాధ్యమయ్యేదని ఆయన స్పష్టం చేశారు.
వాణిజ్యాన్ని రాజకీయ క్షేత్రంలో శాంతి సాధనంగా వాడటం అమెరికా ప్రభుత్వం తరచుగా చేస్తూనే ఉంది. కానీ ఈసారి రెండు అణు శక్తులు కలిగిన దేశాల మధ్య సరిహద్దుల్లో తూటాల జల్లును నిలిపించడంలో దాని ప్రభావం ఎంత ఉందో ట్రంప్ స్పష్టంగా చూపించారు. ఈ జోక్యం ఫలితంగా వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికీ అంతర్జాతీయ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది.