– ఆకు కదిలిన అలజడి అయితే చాలు…పాము పడగెత్తి బుస కొడుతుంది.
– సమీపంలో చిన్న చప్పుడు అయితే చాలు..తేలు తన కొండిని పైకి లేపుతుంది.
– శనివారం రాత్రి అయిందంటే చాలు…క్షుద్రజ్యోతి బాధాకృష్ణ తన రక్తపు వాంతులను ప్రారంభిస్తాడు!
ఎప్పటిలాగే “మంట కలసిన మర్యాద” అంటూ తన పాచిపోయిన వంటకాన్ని సిద్ధం చేసిపెట్టాడు. తన విషపు ఊహలను పాఠకుల మెదళ్లలోకి ఎక్కించడానికి అన్ని రకాల మసాలాలను నూరిపెట్టాడు.
“ప్రస్తుతానికి మండలి చైర్మన్ షరీఫ్ అమరావతి ప్రాణవాయువును నిలబెట్టాడు..శాసనమండలిలో ఆ బిల్ పాస్ కావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత అది చట్టరూపం తీసుకున్నప్పటికీ, విచారణ జరపడానికి హైకోర్టు సిద్ధంగా ఉంది” అంటూ భవిష్యత్చిత్రాన్ని చూచాయగా ప్రదర్శించాడు.
అనగా చంద్రబాబు గత ఐదేళ్లలో ప్రదర్శించి అయిదుకోట్లమంది ఆంధ్రులను వెర్రివాళ్లను చేయడమే కాకుండా, తాను, తన దొంగలముఠా కొట్టేసిన నాలుగువేల ఎకరాలను కాపాడుకోవడానికి హైకోర్టును కూడా ఉపయోగించుకుంటామని హెచ్చరిస్తున్నాడు. గత పాతికేళ్లుగా పద్దెనిమిది స్టే లను కొనసాగిస్తూ, ఈ దేశంలోని ఏ కోర్టులూ కూడా తనను ఏమీ చేయలేవని రుజువు చేసుకున్న చంద్రబాబు హైకోర్టు ద్వారానే మరోసారి తన లక్షలకోట్ల అవినీతి సంపదను కాపాడుకుంటారని రాధాకృష్ణ పరోక్షంగా సూచిస్తున్నాడు. హైకోర్టులో కేసు వేసాక, దాన్ని కోర్టు స్వీకరించాక విచారణ జరపాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది హైకోర్టు. హైకోర్టు విచారిస్తుంది అని ముందుగానే రాధాకృష్ణ హైకోర్టు తరపున వకాల్తా పుచ్చుకుని హుంకరిస్తున్నారంటే ఇప్పటికే హైకోర్టును ప్రభావితం చేశారని మనబోంట్లకు సందేహం వస్తే తప్పేంటి?
“మేం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం మా ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరులు విశాఖలో వాలిపోతారన్న భావనే మాకు రుచించడం లేదు. మేం సంపాదించుకున్న భూములకు టికానా ఉండదా? అన్న ఆందోళనలో మేం ఉన్నాం” అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలాలు, భూములు ఉన్నవారు అవి కబ్జాకు గురవుతాయేమోనన్న భయంతో ప్రహరీలను నిర్మించుకుంటున్నారు.” అంటూ మరో విషగుళిక!
పాత జానపద సినిమాల్లో మనం లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటాము…బందిపోటు దొంగలు గ్రామం మీద విరుచుకుని పడతారు…వీధుల్లో తిరుగుతున్న గ్రామస్తులు ఆడా మగా అందరూ భయంతో ఇళ్లలోకి పరుగులు తీసి తలుపులు దభాల్న వేసుకుంటారు….అయినప్పటికీ, ఆ బందిపోట్లు ఇంటిముందున్న ధాన్యపు బస్తాలను, చేతికి చిక్కిన కన్యలను బలవంతంగా తరలించుకుని పోతారు! ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులను ఆనాటి బందిపోటు దొంగలతో పోల్చుతూ వారు విశాఖపట్నం వెళ్లిన మరుక్షణమే విశాఖ వాసుల భూములను కబ్జా చేస్తారనే భయంతో ఆగమేఘాల మీద ప్రహరీగోడలు కట్టించేసుకుంటున్నారట! వారేవా! అమరావతిలో అడుగుపెట్టకముందే తన దొంగలముఠాతో నాలుగువేల ఎకరాలను బినామీ పేర్లతో కారుచౌకగా కొట్టేసిన చంద్రబాబు ఘన చరిత్ర ముందు జగన్ ఎంత? జగన్ ఫలానా చోట భూములను కాజేసాడని గత ఐదేళ్లలో చంద్రబాబు ఏనాడైనా నిరూపించగలిగారా? ఇప్పుడు ఆ భూముల మీద సిఐడి విచారణ జరుగుతూ నారాయణ, పుల్లారావు లాంటి కబ్జాకోరుల నామధేయాలు బయటకి వస్తుంటే రాధాకృష్ణకు ఒళ్ళంతా అమ్మవారు పోస్తున్నది!
“మండలిని పునరుద్ధరించింది జగన్ తండ్రి వైఎస్. ఇప్పుడు వద్దంటున్న ధర్మాన ప్రసాదరావు ఆరోజు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?” అంటూ మరో తుంటరి ప్రశ్న విసురుతాడు రాధాకృష్ణ!
సదరు మండలి సభ్యులు…మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు తనకు కంట్లో నలుసులా తయారయ్యారనే అకారణ ఆగ్రహంతో నందమూరి తారక రామారావు శాసనమండలి పీక నొక్కి చంపేసినపుడు…మండలిని రద్దు చెయ్యడానికి వీల్లేదని నేడు గొంతు చించుకుంటున్నమాజీ ముఖ్యమంత్రి, ఇరవైతొమ్మిది గ్రామాల కులనాయకుడు చంద్రబాబు తన నవరంధ్రాలన్నీ మూసుకుని ఎందుకు వీక్షించారు? మామగారిని ఎందుకు వారించలేదు? ఆనాడు చంద్రబాబు మామగారిని వారించి ఉన్నట్లయితే నేడు చంద్రబాబుకు ఇంతటి శ్రమ తప్పేది కదా! చెబుతావా రాధాకృష్ణా?
“వికేంద్రీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు గానీ, ఆ తర్వాత శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపే సమయంలో గానీ అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యుల ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉంది. వాటికి జగన్ ముసిముసిగా నవ్వాడు” మరో సన్నాయినొక్కు కక్కుతాడు బాధాకృష్ణ!
అరెరెరె వేధాకృష్ణా! గత అయిదేళ్ల చంద్రబాబు గారి దివ్యపాలనలోనే కదా మనం నరికేస్తా, పాతేస్తా…నాకొడకా” లాంటి మంగళకరవాచకాలు వీనులారా విన్నది! ఆనాడు చంద్రబాబు ముసిముసిగా నవ్వకుండా బిగ్గరగా రోదించాడా?
“అనర్హులను అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందనీ, తొత్తులకు పదవులు కట్టబెట్టారనీ మంత్రి బొత్స విమర్శించడం అభ్యంతరకరంగా ఉంది”.
మండలి చైర్మన్ షరీఫ్ అనుసరించిన విధానం ప్రజాస్వామ్య వ్యతిరేకం. విద్యావంతులు అందరూ అయన తీరును తప్పు పట్టారు. చివరకు షరీఫ్ సైతం తాను చేస్తున్నది తప్పు అని అంగీకరించారు. తప్పు చేస్తున్ననై తెలిసీ తప్పు చేసిన షరీఫ్ అలాంటి ఉన్నత పదవిలో ఉండటానికి అర్హుడా? షరీఫ్ నిర్ణయాలు తీసుకోవలసింది నిబంధనలను అనుసరించా లేక రైతుల బాధలను చూసా బాధాకృష్ణా?
” ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని మంత్రి కన్నబాబు వంటివాళ్లు వింతవాదన చేస్తున్నారు” అంటూ మరో ప్రేలాపన !
సుమారు నలభై ఏళ్ళక్రితం అనుకుంటాను….అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఒంగోలులో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఒక వృద్ధుడు ఏదో వినతిపత్రం అందించగా దాన్ని చదివిన చెన్నారెడ్డి అప్పటికప్పుడే చర్యలు తీసుకోవలసిందిగా వేదిక మీదున్న అధికారులను ఆదేశించారు. అప్పుడు ఒక అధికారి “దీనిమీద చర్య తీసుకోవాలంటే జీవో జారీ చెయ్యాలి సార్” అని బదులిచ్చాడు. ఆ మాటకు ఆగ్రహించిన చెన్నారెడ్డి “వాట్ నాన్సెన్స్? నేను చెప్పిన తరువాత ఇక జీవో ఏమిటి? నా మాటే జీవో.” అన్నారు తీవ్రస్వరంతో. ఆ వృద్ధుడి పని తక్షణమే అయిపొయింది.
Also Read –
సుమారు పదేళ్లక్రితం పంజాబ్ లో ఒక జిల్లా జడ్జి గారు ప్రయాణం నిమిత్తమై రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఆయనకు టిసి నుంచి అవమానం ఎదురైంది. వెంటనే జడ్జిగారు అక్కడున్న ఒక బెంచ్ మీద నల్లగుడ్డ పరచి కుర్చీలో కూర్చుని రైల్వే శాఖ తీరుమీద కేసును సుమోటో గా స్వీకరించి విచారణ జరుపుతున్నట్లు ప్రకటించి స్టేషన్ మాస్టర్ ను నిందితుడుగా చేర్చి తక్షణమే తన బెంచ్ ముందు హాజరు కావాల్సిందింగా తన గుమాస్తతో ఆదేశాలు పంపించారు. దాంతో వణికిపోయిన రైల్వే శాఖ అధికారులు పరుగెత్తుకుంటూ వచ్చి జడ్జి గారిని క్షమాపణ కోరి శాంతింపజేశారు!
ముఖ్యమంత్రి అంటే గుమస్తా కాదని రాధాకృష్ణ తెలుసుకోవాలి. శక్తివంతుడైన ముఖ్యమంత్రి బాత్ రూమ్ లో కూర్చుని కూడా ఆదేశాలను జారీ చెయ్యగలడు. యంత్రాంగం ఆ ఆదేశాలను పాటించి తీరాల్సిందే.
ఇక ఈ రొచ్చులోకి బీజేపీని కూడా దింపాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు క్షుద్ర బాధాకృష్ణ. తెలుగుదేశం బీజేపీతో తెంచుకోవడంతోనే అధికారం కోల్పోయిందని రాధాకృష్ణ గట్టి నమ్మకం. ఎలాగైనా తెలుగుదేశం, బీజేపీలకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తహతహలాడుతున్నాడు. జనసేన వంటి కురూపిని, పనికిమాలిన నిష్టదరిద్రురాలిని పెళ్లి చేసుకున్నందుకు బీజేపీని నిందిస్తున్నాడు. రాజధాని రైతుల తరపున నిలబడి జగన్మోహన్ కు సహకరించకుండా ఉంటె, రాజధానిని మార్చకుండా చంద్రబాబు గారి నలభై వేలకోట్ల రూపాయల ఆస్తులను రక్షిస్తే బీజేపీకి మంచి పేరు వస్తుందని ఆశపెడుతున్నాడు. తద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమలో బీజేపీ మట్టిగొట్టుకుపోయినా ఫర్వాలేదు ఆయనకు. కర్నూలు లో హై కోర్ట్ పెట్టాలని బీజేపీ ఏనాడో తీర్మానం చేసిన సంగతి రాధాకృష్ణకు గుర్తు లేదేమో కానీ, బీజేపీకి గుర్తుండే ఉంటుంది.
ఇక ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి ద్రోహం చేసి వైసిపి వైపు వెళ్లిపోయారని, రేపు సోమవారం నాటికి ఇంకెంతమంది జారిపోతారో అని రాధాకృష్ణ నరకవేదన అనుభవిస్తున్నాడు. అయ్యో…చంద్రబాబు గారి పాలనలో వైసిపి టికెట్ మీద ఎన్నికయిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు కొనేశాడే! అది ప్రజాస్వామ్యానికి ఆఘాతం కాదా రాధాకృష్ణా? నీ అంతరాత్మను ప్రశ్నించుకో…అదంటూ ఉంటె!
రాధాకృష్ణ ఎంత విషం చిమ్మినా, తన కులగజ్జిని ఎంత ప్రదర్శించుకున్నా… అమరావతి తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నించినా, అది ఆగేది కాదు. అయినా…చావబోతున్నవాడు చివరివరకు బతకాలనే ప్రయత్నిస్తాడు కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు