జగన్ దెబ్బ మామూలుగా లేదుగా!

YS Jagan

రాజకీయాల్లో చంద్రబాబుది కాస్తా కూస్తా అనుభవం కాదు.  నలభై రెండేళ్లుగా ఆయన రాజకీయాలను దున్నేస్తున్నారు.  మరి ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో గానీ, ఆనాటి అగ్రశ్రేణి నటుడు నందమూరి తారకరామారావు ఇంటి అల్లుడు అయ్యాడు.  ఆ అల్లుడరికమే లేకపోయి ఉన్నట్లయితే ఎంతోమంది రాజకీయ నాయకుల్లాగా చంద్రబాబు చిరునామా కూడా గల్లంతయ్యేదే.   చంద్రబాబును అల్లుడుగా చేసుకుని  ఎన్టీఆర్ తన జీవితాన్ని తానే మరణశాసనం లిఖించుకున్నారు కానీ, చంద్రబాబు మాత్రం మామగారిని స్వర్గానికి పంపిన తరువాత తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏకధాటిగా ఏలారు.  ఆ తరువాత రాష్ట్రం చీలిపోయిన తరువాత మరో అయిదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు.  

రెండు ఎకరాల ఆస్తిపరుడు వేలకోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.  మీడియాను గంపగుత్తగా కొనుగోలు చేసి తన కాళ్ళకింద ధూళిలా, చెప్పుకింద తేలులా మలచుకున్నాడు.   ఈ మీడియా ఎంతకు తెగించింది అంటే మొన్నటి ఎన్నికల తరువాత చంద్రబాబు కాబోయే ప్రధానమంత్రి అని, రాష్ట్రపతి అని, ఉపరాష్ట్రపతి అని, ఉప ప్రధాని అని వ్యభిచారపు రాతలు రాసేంతగా. ఇక పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని లోకేష్ ను  మహా మేధావిగా, తండ్రికి సైతం సలహాలు ఇచ్చే బృహస్పతి అన్న లెవెల్లో మోయడానికి సాహసించింది.  

ఇక జగన్ మీద దుష్ప్రచారం చెయ్యడంలో అన్ని హద్దులూ దాటేసింది మన తెలుగు క్షుద్ర మీడియా. జగన్ మీద చెయ్యని ఆరోపణలు లేవు.  జగన్ మీద వెయ్యని నిందలు లేవు.  మేరుపర్వతంలా రోజురోజుకు ఆకాశం వైపు దూసుకునిపోతున్న జగన్ ప్రభావాన్ని నిలువరించడానికి ఈ కులగజ్జి మీడియా చెయ్యని ప్రయత్నం లేదు.  ఎన్నికల తరువాత దేశంలోని అన్ని సర్వ్ సంస్థలు వైసిపి అధికారంలోకి రావదం ఖాయం అని కుండబద్దలు కొడుతున్న తరుణంలో కూడా లగడపాటి రాజగోపాల్ లాంటి అవినీతిపరులతో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న అబద్ధపు ప్రచారాలను నిస్సిగ్గుగా చేసేసింది.    దేశంలో మరెక్కడా లేని దౌర్భాగ్యపు మీడియా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనకు కనిపిస్తుంది. 

ఎన్నికల ఫలితాలతో మైండ్ బ్లాంక్ అయిపోవడంతో మూడు నెలలపాటు చంద్రబాబు ఇంట్లోనించి బయటకు అడుగు పెట్టడానికి సాహసించలేదు.  ఇక ఆ తరువాత నుంచి కులగజ్జి మీడియా సహకారంతో జగన్ ను ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదు.  అమరావతి రాజధానిని తరలిస్తామని జగన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఖంగు తిన్నది.  ఎందుకంటే ప్రస్తుత అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి తగినది కాదని జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ నిష్కర్షగా సిఫార్స్ చేసినప్పటికీ, అక్కడ కేవలం తమ సామాజికవర్గం వారు ఉన్నారనే కారణంతో ఎవరినీ సంప్రదించకుండా రాజధానిని నిర్ణయించారు చంద్రబాబు.  తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తూ, మాయమాటలతో మభ్యపెట్టిన చంద్రబాబు రాజధాని భూముల సేకరణలో అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి.  వీటిమీద విచారణ జరిపిస్తే కానీ  నిజానిజాలేమిటో నిగ్గు తేలవు. 

ఇక జగన్ ఏ చర్యలు తీసుకున్నా వాటికి అడ్డుపడటం చంద్రబాబు, ఆయన బానిస మీడియా దినసరి కృత్యంగా మారిపోయింది.  హైకోర్టు ద్వారా అనేక సంస్కరణలను అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.  పేదింటి పిల్లలకు కూడా ఆంగ్లవిద్యబోధన ఉచితంగా అందించాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి కోర్టును అడ్డం పెట్టుకుని అవరోధం కలిగించారు.  ఆ చర్యతో ఎస్సీ ఎస్టీ మరియు ఇతర అణగారిన వర్గాలవారికి తెలుగుదేశం దూరం అయింది.  

మొన్న విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గాస్ లీకేజ్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ రచ్చ చెయ్యాలని ప్రయత్నించింది.  మృతులకు ఇరవై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చెవికోసిన మేకలా అరిచారు చంద్రబాబు….ఎలాగూ జగన్ అంత పరిహారం ఇవ్వదని ఉద్ద్యేశ్యంతో.  కానీ, జగన్ ఎవరూ ఊహించని విధంగా, ఇంతవరకు దేశచరిత్రలోనే లేని విధంగా ఒక్కొక్క కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం ప్రకటించడంతో చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాల నోట మాటా పలుకూ లేకుండా పోయింది.  పరిహారం అందించడమే కాక నాలుగు రోజుల్లోనే స్వయంగా బాధితులకు అందించడంతో తుచ్చ రాజకీయాలు చెయ్యడానికి ఛాన్స్ లేకుండా పోయింది చంద్రబాబుకు. 

ఇక జగన్ ప్రభుత్వం మొన్న విడుదల చేసిన 203  జీవోతో చంద్రబాబు సగం చచ్చిపోయాడనే చెప్పాలి.  జీవోకు అనుకూలంగా మాట్లాడితే కేసీఆర్ కు ఆగ్రహం రావడమే కాక, జగన్ నిర్ణయాన్ని బలపరచినట్లవుతుంది.  వ్యతిరేకిస్తే రాయలసీమ వారి దృష్టిలో విలన్ గా మారిపోతాడు.  ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడమే కష్టం అవుతుంది.  జగన్ కొట్టిన ఈ దెబ్బతో చంద్రబాబు గిలగిలా కొట్టుకుంటున్నాడన్నది యదార్ధం.  అంత అనుభవమూ ముఖ్యమంత్రిగా ఏడాది అనుభవం లేని జగన్ ముందు పనికిరాకుండా పోవడంతో తెలుగు తమ్ముళ్లు ఖిన్నులైపోతున్నారు! 

Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు