ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరిగా గుర్తింపుపొందిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం నేడే. ఈ గురువారంకు ఆయన 70వ సంవత్సరంలో అడుగిడుతున్నారు. దేశ చరిత్రలోనే విశిష్ట రాజకీయ నాయకుడైన ఈ ధీశాలికి ప్రపంచం నలుమూలల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ దేశాల అధ్యక్షులు,ప్రధానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక దేశంలో ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా అధికార,ప్రతిపక్షాల నేతలు,క్రీడా,సినీ ప్రముఖులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు రాజకీయాలకు అతీతంగా పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. అయితే ఒకవైపు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా మరోవైపు అసలైన కథానాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎప్పటిలాగే తన పుట్టిన రోజును నిశ్శబ్థంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా అత్యంత నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.
ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు ఇలా…
ప్రధానిగా నరేంద్ర మోడీ ఎప్పుడూ వైభవంగా తన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరగలేదు. ఈ ఏడాది కూడా తన పుట్టినరోజులూ సెప్టెంబర్ 17 న ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని అభిమానులకు,తమ పార్టీ నేతలకు నరేంద్ర మోడీ ముందుగానే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వట్టర్లో ప్రకటన చేశారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని, ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రత్యేకించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అందుకు బదులుగా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన ట్వీట్ చేశారు.
గతంలో ఇలా…
2014లో తొలిసారిగా ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తన జన్మదినం నాడు తన మాతృమూర్తి హీరాబెన్‌ను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత పుట్టిన రోజుల సందర్భాల్లోనూ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో గడపడమే చేస్తున్నారు. 2015లో 65వ జన్మదినం సందర్భంగా 1965 వార్ ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. కారణం ఆ ఏడాదే భారత్-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 2016లో 66 వ జన్మదిన వేడుకలును మరోసారి తన మాతృృమూర్తి సమక్షంలో జరుపుకున్నారు. 2017లో మోడీ తన 67 జన్మదినం సందర్శంగా సర్దార్ సరోవర్ డ్యాంను ప్రారంభించారు. 2018లో 68వ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటించి, అక్కడ ఒక పాఠశాలలో చిన్నారులతో గడిపారు. 2019లో మరోసారి సర్దార్ సరోవార్ డ్యాంను సందర్శించి నర్మదా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం తన తల్లి ఆశీర్వదం తీసుకున్నారు. ఈ ఏడాదిమోడీ తన పుట్టినరోజు ఎలా జరుపుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ నిర్ణయం ఇది….
ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు వారం రోజులపాటు సేవా సప్తాహం కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా గురువారం వారం రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే మోడీ 70 వ పుట్టిన రోజుకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 ప్రాంతాల్లో 70 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మోవైపు తమ ప్రియతమ నేత మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు కానుకగా అందజేశారు. న్యూఢిల్లీలోని ఆదర్శ్‌నగర్లో పాక్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధులకు కుట్టుమిషన్లు, ఈ రిక్షాలు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. తమిళనాడు కోయంబత్తూర్ లో మోదీ 70వ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు 70 కిలోల లడ్డూను శివాలయంలో పంపిణీ చేశారు. హిందూ సేన ఢిల్లీలోని శివశక్తి మందిరంలో మోదీ జన్మదినోత్సవాన్ని నిర్వహించింది.