మానవత్వ కోణం కబుర్లు చెబుతున్న హమాస్… ఇవే కామెంట్స్!

ఇజ్రాయేల్ – హమాస్ మధ్య భీకరపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయేల్ పై దాడులను రికార్డ్ స్థాయిలో మొదలుపెట్టినప్పటికీ… ఇప్పుడు హమాస్ కు ఫుల్ గా వాయింపు అయిపోతుందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి! ఏ విషయంలోనూ ఇజ్రాయేల్ తగ్గడం లేదు. పైగా.. మానవ మృగాలతో పోరాడుతున్నందువల్ల.. తాము తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మానవతా కోణం గుర్తుకురావడం గమనార్హం.

ఇజ్రాయేల్ పై దాడి చేయాలని ఫిక్సయిన హమాస్… తెల్లవారు జామున 20 నిమిషాల వ్యవధిలో సుమారు 5000 రాకెట్లను ఇజ్రాయేల్ పై ప్రయోగించింది. అనంతరం భుతల దాడుల్లో భాగంగా అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ఇందులో భాగంఘా మ్యూజికల్ ఫెస్ట్ లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇదే సమయంలో సుమారు 200 మందిని బందీలుగా చేసుకుని గాజాకు తీసుకుపోయారు. దీంతో… ఇజ్రాయేల్ ప్రతిదాడి షురూ చేసింది.

ఈ దాడుల్లో అధికారికంగా ఇప్పటివరకూ సుమారు 4000 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని తెలుస్తుండగా.. గాజా సరిహద్దుల్లోనే 1500 మంది హమాస్ మిలిటెంట్లు మృతిచెందారని ఇజ్రాయేల్ ఒకానొకసమయంలో ప్రకటించింది! ఈ సమయంలో బందీలుగా ఉన్న తమ ప్రజలకోసం గాజాను అష్టదిగ్బంధనం చేసింది ఇజ్రాయేల్ సైన్యం. ఈ నేపథ్యంలో గాజాపై విచక్షణారహితంగా దాడులు చేసుందని అంటున్నారు.

దీంతో రాజీప్రయత్నంలో భాగమో ఏమో తెలియదు కానీ… ఉన్నఫలంగా మానవతా కోణం టాపిక్ ఎత్తింది హమాస్ ఉగ్రవాద సంస్థ. ఇందులో భాగంగా… గాజాలో తమ చెరలో బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేసినట్లు హమాస్‌ ప్రకటించింది. కతార్‌ సంప్రదింపుల నేపథ్యంలో మానవతా కోణంలో భాగంగా అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను విడుదల చేసినట్లు టెలిగ్రాంలో పోస్టు చేసింది. దీంతో… అమెరికా విషయంలో హమాస్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా… అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ లోని పలు ప్రాంతాలపై దాడి చేసిన హమాస్‌ ఉగ్రవాదులు.. సుమారు 200 మంది ఇజ్రాయెల్‌ తో పాటు ఇతర దేశాల పౌరులను బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. వీరందరినీ గాజాకు తరలించి.. అక్కడున్న సొరంగాలలో బందించినట్లు చెబుతున్నారు. దీంతో గాజాను అన్నివైపుల నుంచి చుట్టుముట్టి హమాస్‌ ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.

ఈ దాడులతో గాజా గజ గజా వణికిపోతోంది. మరోవైపు ఉత్తర గాజాను ఖాళీ చేయమని చెప్పిన ఇజ్రాయేల్.. మరోవైపు దక్షిణా గాజాపైనా దాడులు చేస్తోంది. దీంతో… దిక్కుతోచని స్థితిలో గాజా ప్రజలు వణికిపోతున్నారన్ని అంటున్నారు. ఇదే సమయంలో… హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి త్వరలో భుతల దాడులకు ఇజ్రాయేల్ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ సమయలో ఇప్పటికే.. దాడులు ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెప్పిందంటూ కొన్ని దేశాలు ముందుకొస్తున్న నేపథ్యంలో… ఇప్పుడు కతర్ మధ్యవర్తిత్వంతో అమెరికా పౌరులను మానవతాకోణంలో విడిచి పెట్టినట్లు హమాస్ చెప్పుకుంటుంది. దీంతో… తవ్తం బోదపడిందో ఏమో… హమాస్ ఉగ్రవాదులు రాయబారాలకు దిగుతున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇజ్రాయేల్ మాత్రం.. తమ పౌరులను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసన్నట్లుగా ముందుకు పోతోంది!