Home Andhra Pradesh పేకాట క్లబ్బు అంశంతో మళ్లీ ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

పేకాట క్లబ్బు అంశంతో మళ్లీ ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

గుంటారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కొత్త సమస్యలు వస్తున్నాయని సమాచారం. అనుచరగణమే ఇపుడు ఆమెను బుక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. సోషల్ మీడియా వేదికగా ఆమెను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలతో సద్ధుమణిగిందనుకుంటున్న రెయిన్‌ ట్రీ పార్క్‌ లో పేకాట క్లబ్బు వివాదాన్ని ఇప్పుడు మాజీ అనుచరులే వెలికి తీస్తున్నారని సమాచారం.

Rum | Telugu Rajyam

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి … తన అనుచరులతో జిల్లాలో పేకాట క్లబ్బులు నడిపించి బాగా పోగేసుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేయడంతో పాటు పేకాట క్లబ్ నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టడంతో ఈ వ్యవహారం అప్పట్లో రచ్చ రచ్చ అయింది. అయితీ ఈ పేకాట క్లబ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు. కొంత మంది కావాలని తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అయితే పోలీసులు ఎవరిపై అయితే కేసులు పెట్టారో వాళ్లు మాత్రం నేరుగా ఉండవల్లి శ్రీదేవిపై ఆరోపణలు చేయకున్నా… తన సన్నిహితుల వద్ద తప్పంతా ఆమె పై నెడుతున్నారంటా. ఆవిడ సహకారంతోనే పేకాట క్లబ్బులు నిర్వహించినట్లు వాళ్లు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని వినికిడి. అయితే ఈ అంశాన్ని వాళ్లు నేరుగా మీడియా ముందు వివరించలేదు. అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం సదరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

54203905 400334363876290 5964785241347325952 N | Telugu Rajyam

పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో ఏమి చేయాలో తోచక అప్పట్లో సైలెంట్ అయిపోయిన నాయకులు ఆతర్వాత తేరిగ్గా తేరుకొని ఇప్పుడు సదరు మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని సమాచారం. ఇందు కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నారని తెలుస్తోంది. పేకాట క్లబ్బులకు సంబంధించి సదరు మహిళా ఎమ్మెల్యేతో నడిపిన ఫోన్ సంభాషణలను సదరు వ్యక్తులు ఇప్పుడు వాటిని బయటపెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

M1 | Telugu Rajyam

అయితే ఈ హెచ్చరింపులను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొట్టిపారేస్తున్నారు. తనకు పేకాట క్లబ్బుకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ఈపాటికే నిర్దారణ అయిపోయిందని చెబుతున్నారు. కొంత మంది కావాలని తన ప్రతిష్టకు భంగం కలిగించి రాజకీయంగా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా పార్టీ అధిష్టానం కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొంత మంది స్వార్థపరుల తనపై కక్ష కట్టి ఇలాంటివి చేయిస్తున్నారని ఆమె చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా సదరు ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తోంది.

- Advertisement -

Related Posts

వెంకటేష్ నారప్ప రిలీజ్ ఎప్పుడు ..?

వెంకటేష్ నారప్ప సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్స్ అంతగా రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకటేష్ మరోసారి తమిళ సూపర్ హిట్...

రవితేజ కాదు ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ విజయ్ సేతుపతి చేతిలో ఉందా ..?

రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ దక్కలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత...

దేవాలయాలపై దాడులు: దుష్ప్రచార పర్వమే పెను ప్రమాదం!

ఆంధ్రపదేశ్‌లో దేవాలయాలపై దాడులకు సంబంధించి తీవ్ర స్థాయిలో పెను దుమారం రేపుతున్న విషయం విదితమే. అంతర్వేది రధం దగ్ధం, రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి విగ్రహం తల భాగాన్ని తొలగించడం.. ఇవన్నీ చాలా చాలా...

అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత ..?

అఖిల్ 4 గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సమంత గెస్ట్ రోల్...

Latest News