మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రూటు ఎటు వైపు… టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ఈ ప్రక్రియ మాత్రం ముందుకు పడడం లేదు. జెండా మార్చేందుకు గంటా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నా చివరి క్షణంలో వచ్చిన పడుతున్న అవాంతరాలతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారంటా.
దీంతో అసలు గంటాను వైసీపీలోకి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు అనేది ఇప్పుడు సర్వత్రా హాట్టా టాపిక్ గా మారింది. విశాఖ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే ఇప్పుడు ఆకోటకు బీటలు పడుతున్నాయి. రోజుకో రాజకీయ పరిణామాల మధ్య విశాఖ రాజకీయం రక్తి కట్టిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పరిస్థితి నానాటికి దిగజారిపోతుండడంతో గంట పయనమెటు అన్న అనుమనాలు రేకెత్తుతున్నాయి. టీడీపీ దుకాణం రోజు రోజుకు ఖాళీ అవుతోంది. విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో వాసుపల్లి సురేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు మరో ఇద్దరు వైసీపీ పార్టీతో టచ్ లో ఉన్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరేందుకు మూహూర్తాల మీద మహూర్తాలు పెట్టుకుంటున్నారు. మళ్లీ ఏమవుతోందో ఏమో అంతే వేగంగా వెనకడుగు వేస్తున్నారు . కిందటి ఎన్నికల్లో వైసీపీకి విశాఖలో చేధు అనుభవం ఎదురైంది. మిగతా చోట్లతో పోల్చితే ఇక్కడ టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎన్నికయ్యారు. దీంతో గెల్చిన ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుంటే టీడీపీని ఖాళీ చేయొచ్చని ఫ్యూహ రచన చేసింది వైసీపీ. ఇందులో భాగంగా గంటా శ్రీనివాస్ కు గాలం వేసింది. ఆయన కుడా పార్టీ మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాని ఏమవుతోందో ఏమో కాని చివరి క్షణంలో బ్రేకులు పడుతున్నాయి.
మొదట్లో ప్రజారాజ్యం నుంచి గెల్చి ఆతర్వాత చిరంజీవితో సహా కాంగ్రెస్ లో చేరిపోయిన గంటా….. ఆతర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల కారణంగా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ మారిన వెంటనే తన స్థాయికి తగ్గట్లుగా ఓ మంచి కార్పోరేషన్ పదవిని దక్కించుకుంటారనే ప్రచారం చేస్తున్నారు ఆయన అనుచరులు.
అయితే గంటా పార్టీలోకి రాకుండా ఇద్దరు వైసీపీ సీనియర్ నేతలు మొదటి నుంచి అడ్డుకుంటున్నారని టాక్. అయితే అడ్డుపడుతున్న వారికి సర్థి చెప్పకుండా… గంటా నేరుగా సీఎం జగన్ తోనే మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఇదే పెద్ద అడ్డంకిగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. చూడాలి మరి గంటా ప్రస్థానం రానున్న రోజుల్లో ఎటు వైపుకు సాగుతుందో.