Manmohan Singh Passed Away: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎయిమ్స్ు వెళ్లారు. బెల్గావిలో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరారు. శుక్రవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.