ముందస్తు గందరగోళం.! మోడీ మార్కు వ్యూహం.!

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు.. అంటే,. ముందస్తు ఎన్నికల హంగామా కనిపిస్తోంది. అంతే మరి.. జమిలి ఎన్నికలంటే, ముందస్తు ఎన్నికలుగానే భావించాలి. ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని, కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సి వుంటుంది ‘జమిలి’ పేరుతో.!

అదే జరిగితే, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయ్. అది కాదంటే, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలు, వాయిదా పడతాయేమో.! కానీ, అందుకు ఆస్కారం చాలా చాలా తక్కువ. ప్రస్తుతానికైతే, ముందస్తు అయోమయాన్ని ప్రధాని మోడీ అత్యంత వ్యూహాత్మకంగా సృష్టించగలిగారు.

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి గందరగోళం కనిపిస్తోంది. వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారా.? లేదా.? తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడితే, ఏమవుతుంది.? ఇలా సవాలక్ష ప్రశ్నలు. పోటీకి దిగాలనుకుంటున్న అభ్యర్థుల పరిస్థితి అత్యంత దయనీయం.

అవును మరి, పార్టీలు కావొచ్చు.. అభ్యర్థులు కావొచ్చు.. ఎన్నికల కోసం ముందస్తుగానే అన్ని వనరులు సమకూర్చుకోవాలి కదా.! ఈ ఏడాది డిసెంబర్ కోసమా.? వచ్చే ఏడాది ఏప్రిల్ కోసమా.? అన్న గందరగోళం రాజకీయ నాయకుల్ని అయోమయంలో పడేస్తోంది. బహుశా ఇదే కోరుకుంటున్నట్టున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

కాగా, జమిలి ప్రతిపాదనని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదెక్కడి పంచాయితీ.? అన్నది రాహుల్ గాంధీ ప్రశ్న. దేశం మొత్తాన్నీ, రాజకీయంగా తను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

జమిలి మంచిదే.. కానీ, ఇప్పుడు సమయం కాదన్నది మెజార్టీ అభిప్రాయం. జమిలి ఎన్నికలపై కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హమిక్కడ.