Donald Trump: భారత్-పాకిస్థాన్.. మరోసారి ట్రంప్ రొటీన్ సలహాలు!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణులతో దాడులు చేయడం మానేసి, బదులుగా తాము తయారు చేసే అందమైన వస్తువులను పరస్పరం వర్తకం చేసుకోవాలని ఆయన సూచించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, హింసను అడ్డుకునే మార్గంగా వాణిజ్యాన్ని ఉపయోగించానని, కాల్పుల విరమణ ఒప్పందానికి తన ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

“మీరు అణు బాంబులు తయారు చేయడం మానేసి, అందమైన వస్తువులు తయారు చేయండి. కాఫీ, వస్త్రాలు, హస్తకళలు… ఇవే స్నేహానికి నిదర్శనంగా ఉండాలి. ఉగ్రవాదం వల్ల భూమ్మీదెక్కడా శాంతి లేదు. దాన్ని అరికట్టాలంటే మేమంతా కలిసి ముందుకెళ్లాలి” అంటూ ఆయన చెప్పిన మాటలు ఆ సభలో హర్షధ్వానాలకు దారి తీసాయి.

అయితే పాక్ తప్పు చేసినప్పటికీ ట్రంప్ ఇరు దేశాల విషయంలో ఒకే రకంగా ఆలోచించడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇరు దేశాలకు యుద్ధం జరిగితినే ఆయుధాల బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంటుందనే అమెరికా చైనా లాంటి దేశాలు ఆలోచిస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిజంగా అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్ర దాడిపై స్పందించిన విధానంతో భారత్ కు అండగా నిలవాలి కానీ ఆ విషయంలో రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇక రష్యా-ఉక్రెయిన్ అంశంపై కూడా స్పందించిన ట్రంప్, ఆ ఘర్షణకు శాశ్వత పరిష్కారం రావాలంటే అన్ని పక్షాలకూ సంయమనం అవసరమన్నారు. తాను గల శాంతిదూత పాత్రతో ప్రపంచాన్ని మరింత స్థిరంగా మార్చాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు. అణుశక్తుల మధ్య స్నేహంతోనే భవిష్యత్తు నిర్మాణమవుతుందని, క్షిపణుల కంటే మానవత్వం గొప్పదని ట్రంప్ మరోసారి తన శైలిలోనే హితవు పలికారు. ఏదేమైనా ట్రంప్ మాటల వరకే శాంతి అంటున్నా కూడా కార్యాచరణలో ఆ విధానము కనిపించడం లేదని అనిపిస్తుంది.