అతనో గొప్ప దర్శకుడు. కానీ, ఒకప్పుడు. ఇప్పుడైతే చివరికి ట్వీట్లు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోయాడు. ఎవరా ఫిలిం మేకర్.? ఏమా కథ.!
అమ్మాయిలతో రాసుకు పూసుకు తిరుగుతూ, తానొక రసిక శిఖామణుడ్ని అనిపించుకుంటోన్న ఒకప్పటి ఆ సంచలన దర్శకుడు, సినీ.. రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో స్పందించడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలేమీ వుండవట.
లక్షల్లో వున్న ఫాలోవర్స్ నేపథ్యంలో, అతనితో ఓ ట్వీటేయించుకోవడానికి కొందరు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ట్వీటుకి ఇంత.. అని చొప్పున చెల్లిస్తున్నారట. కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా, ‘పెయిడ్ ఆర్టిస్టు’గా అతన్ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
సి-గ్రేడ్ అనే ముద్ర పడుతుందని తెలిసినా, కొందరు ఫిమేల్ సెలబ్రిటీస్ ఆయన చుట్టూ తిరగడం వెనుక మతలబు ఏంటబ్బా.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.