Home TR Exclusive ఆంధ్రలో టిడిపితో కాంగ్రెస్ 6,20 ఫార్ములాతో పొత్తు?

ఆంధ్రలో టిడిపితో కాంగ్రెస్ 6,20 ఫార్ములాతో పొత్తు?

- Advertisement -

(వి. శంకరయ్య*)

కాంగ్రెస్ టిడిపి జట్టు కట్టడం అధికారికంగా  బహిర్గతం కాక ముందే ఒక పక్షం రోజుల క్రితమే ప్రజాశక్తి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో కాంగ్రెస్ పార్టీ కోరే అసెంబ్లీ పార్లమెంటు స్థానాల గురించి పేర్కొంటూ 6-20 పథకాన్ని వెల్లడించింది. టిడిపి కాంగ్రెస్ జట్టు కడతాయని ఆరు పార్లమెంటు స్థానాలు 20 శాసన సభ స్థానాలు కాంగ్రెస్ కోరుతోందని టిడిపి కూడా అంగీకరించ వచ్చినేది ఆ వార్త సారాంశం.అనంతరం రాహుల్ గాంధీ దూతగా కాంగ్రెస్ అగ్ర నేత ఒకరు అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన తర్వాత ప్రజాశక్తి కధనం వాస్తవం అయ్యే విధంగా కాంగ్రెస్ కోరే స్థానాల గురించి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం 20 నుండి 25 శాసన సభ స్థానాలు కోరు తున్న టు సరిగ్గా అదే వార్తలు వింటున్నాము. పార్లమెంటు కు చెంది సీమ లో కాంగ్రెస్ కోరుతున్న స్థానాలను చంద్రబాబు ఎట్టి పేచీ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలో గల తిరుపతి రాజంపేట స్థానాలు కావాలని టిడిపిలో అడిగే వారు లేరు. తిరుపతి రిజర్వు డు స్థానం. 2014 ఎన్నికల్లో తిరుపతి స్థానం బిజెపి కి ఇచ్చారు. వైసిపి చేతిలో ఓటమి చెందారు. రేపు కూడా ఈ స్థానంలో టిడిపి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఏ మాత్రం లేదు. పైగా కావాలని కోరే నేతలేరు. కాకుంటే వర్ల రామయ్య లాంటి వారిని దిగుమతి చేసు కోవాలి. గతంలో ఒక మారు దిగుమతి రాజకీయం చేసి టిడిపి చేతులు కాల్చుకొని వుంది. . ఈ స్థానంలో నెల్లూరు జిల్లాలో గల నియోజకవర్గాలో టిడిపికి తీవ్ర మైన ఎదురు గాలి వుంది. మరో విశేషం ఏమంటే మొన్న నెల్లూరులో ధర్మ పోరాట దీక్ష జరిగిన రోజునే టిడిపి కొమ్ము కాచే పత్రిక ఒక కధనం ప్రకటించుతూ ఎదురు గాలి గురించి నియోజక వర్గాల వారిగా వివరించింది. పైగా తిరుపతి పార్లమెంటు స్థానంలో గల శాసన సభ నియోజకవర్గాలలో టిడిపి బలహినంగానూ ముఠా తగాదాలతో వుందని తెలిపింది. . అయితే గియితే అభ్యర్థులను మార్చక పోతే చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలు గల్లంతే. ఈ దృష్ట్యా తిరుపతి స్థానం కాంగ్రెస్ కు ఇచ్చేందుకు అభ్యంతరాలు వుండక పోవచ్చు. . కాంగ్రెస్ కూడా మాజీ పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ నుదృష్టి లో పెట్టుకుని కోరింది. గతంలో చింతామోహన్ ఈ స్థానం నుండి గెలుపొంది వున్నారు .అటుయిటు తిరిగి చింతామోహన్ రొట్టె విరిగి నోతిలో పడుతుందేమో. అప్పుడే చింతామోహన్ పర్యటనలు మొదలు పెట్టారు. 

కాగా రాజంపేట స్థానం కూడా టీడీపీ కి గాలికి పోయే పిండి కృష్ణార్పణం లాంటి దే. 2014 లో వైసిపి గెలుపొందినది. ప్రస్తుతం కూడా టీడీపీ కి అది బలమైన స్థానంకాదు. . ఈ స్థానంలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఎక్కువ. పైగా కడప జిల్లాలోని నియోజకవర్గాలు వున్నాయి. 2014 ఇది బిజెపి కి ఇచ్చారు. ఓడి పోయారు.

ప్రస్తుతం ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోరుతోంది. ఈ స్థానంలో కాంగ్రెసు కు వున్న నేత ఒక్కరే.

కాంగ్రెస్ పార్టీ కి కిరణ్ కుమార్ రెడ్డి తప్ప వేరే నేత లేని నేపథ్యంలో అదే జరిగితే టిడిపి పువ్వులలో పెట్టి కాంగ్రెసు కు అప్పగించే అవకాశముంది ఫలితంగా టిడిపి కి మంచి మేలే జరుగుతుంది. పీలేరు శాసన సభ స్థానం వైసిపి చేతిలో వుంది ఇది వైసిపి కి బలమైన స్థానం. టిడిపి బలహీనంగా వుంది… . కాంగ్రెస్ టిడిపి జట్టు కట్టక ముందే పథకం ప్రకారం కావచ్చు కాక పోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చు కొని ప్రభుత్వ పదవి కూడా పొంది అధికార లాలసత అనుభవిస్తున్నారు. ప్రస్తుతం సోదరులిరువురి మధ్య మంచి సంబంధాలు లేకున్నా మున్ముందు రాజకీయ అవసరాలు ఒకటి చేసే అవకాశముంది. . తమ్ముడు శాసన సభకు టిడిపి తరపున అన్న కాంగ్రెస్ తరపున పార్లమెంటు కు పోటీ చేసేటిగా వుంటే చంద్రబాబు అడ్డం చెప్పకుండా అంగీకరించుతారేమో.

 

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించితే కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం కావచ్చు. అందుకు సూచికగా పీలేరుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. పైగా పత్రికల వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేయకుండా వెళ్లారు. చేసిన విమర్శలు కూడా కర్ర విరగ కుండా పాము చావ కుండా చేశారు. వాస్తవంలో ఘాటైన విమర్శలు చేయాలి. ఒక ముఖ్యమంత్రి గా జిల్లాలో తన ముద్ర వుండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఉపయోగపడే పధకాలు అమలు చేశారు. కానీ చంద్రబాబు అవన్నీ రద్దు చేశారు. ఇందువలన జిల్లాకు తీవ్ర మైన అన్యాయం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టుకు భంగంకలిగింది. ఈ పరిస్థితి లో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు చేసి వుండాలి. ఆలా జరగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశంతో పరిమిత మైనారో చూడాలి. పైగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని టిడిపి నిలువ రించే అవకాశాలు ఈ ప్రాంతంలో తక్కువ కాబట్టి 
కిరణ్ కుమార్ రెడ్డి పోటీ కి సిద్ద మైతే టిడిపి అంగీకరించే అవకాశం ఉంది. వేరే కాంగ్రెస్ నేత లేరు. ముఖ్యమంత్రి పదవిఅనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడి పోయే అవకాశం వుంటే తను సిద్ధం కాకుండా తన కుమారుడు నుపోటీకి దింపే అవకాశమూవుంది. మరి కాంగ్రెస్ ఏ ఉద్దేశంతో ఈ స్థానం కోరిందో ఈ చిదంబరరహస్యం తొందరలోనే బయట పడ వచ్చు.

 


కాంగ్రెస్ పార్టీ కర్నూలు స్థానం కోరిందంటే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ని దృష్టి లో పెట్టుకొనే కోరారు. వాస్తవంలో రేపు ఎన్నికల్లో జగన్ ను కర్నూలు జిల్లాలో నిలువ రించాలంటే కోట్ల కుటుంబానికి చెందిన వారి అండ తప్పని సరి. . పైగా మొన్నటి వరకు ఊగిస లాడిన బైరెడిరాజశేఖ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చు కున్నారు. ఫలితంగా కోట్ల కుటుంబానికి కొంత బలం చేకూరింది.

ఇవన్నీ అటుంచి 2014 ఎన్నికల్లో వైసిపి తరపున బుట్టా రేణుక గెలుపొంది ఇటీవల టిడిపి తీర్థం పుచ్చు కున్నారు. ఆ మధ్య కర్నూలు జిల్లాకు వెళ్లిన మంత్రి లోకేష్ వచ్చే ఎన్నికల్లోరేణుక పోటీ చేస్తుందని చేసిన ప్రకటన జిల్లా టీడీపీ లో పెద్ద చిచ్చు పెట్టింది. రాజ్యసభ సభ్యులు వెంకటేష్ కుమారుడు భరత్ ఈ స్థానం పై తొలి నుండి కన్నేసి వున్న నేపథ్యంలో పెద్ద రాద్ధాంతం జరిగింది. ప్రస్తుతం టిడిపి కాంగ్రెస్ జట్టు కట్టడం ఖాయమైంది. వాస్తవం చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసు పార్టీ కర్నూలు స్థానం వదిలి పెట్టే అవకాశం వుండదు. అయితే చంద్రబాబు కు కాంగ్రెసు డిమాండ్ బాగా కలిసి వస్తుందేమో. . రెండు పిల్లలు వెన్న ముద్ద కోతి కథ అనుభవానికి వస్తుందేమో. కాంగ్రెస్ తో జట్టు కట్టడం చారిత్రక అవసరంఅనే పేరు చెప్పి అటు రేణుకకు ఇటు భరత్ కు చంద్రబాబు అతి సులభంగా చుక్కలు చూపించ వచ్చు.

టిడిపి కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక తిరుగు లేనిదే. ఏతావాతా సీమకు చెంది కాంగ్రెస్ కోరిన స్థానాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కు పెద్ద అడ్డంకులు వుండనందున గెలుపు ఓటములు పక్కన బెడితే కాంగ్రెస్ కు టీడీపీ కన్నా మేలు జరుగుతుంది . కనీసం డిపాజిట్ లు కోల్పోయిన చోట వీలైతే గెలుపొంద వచ్చు. లేదా పార్టీ పరంగా కాలు నిలదొక్కు కొన వచ్చు. సీమ లో ఈ కలయిక వలన టిడిపి కి కాంగ్రెస్ నుండి వచ్చే లాభం ఓట్ల పరం గా పెద్ద గా వుండదు. కోట్ల కుటుంబం వారి పలుకు బడితో టిడిపి కి కొన్ని ఓట్లు పడవచ్చును. . కిరణ్ కుమార్ రెడ్డి విషయం అంతే. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అతి స్వల్పం. వున్నది మొత్తం వైసిపి వెంట పోయింది
. సీమ లో మైనారిటీలు ఎక్కువ 2014 లో కట్ట గట్టు కొని వైసిపికి వేశారు. దళితులు అంతే. ఆ ప్రమాదం నుండి బయట పడేందుకే ప్రధాని మోడీని రోజు చంద్రబాబు తిట్టి పోస్టునారు. పైగా మైనారిటీ నేతలకు మూడు పదవులు ఇచ్చారు. నేతలకు పదవులు ఇచ్చినంత మాత్రాన ఓటర్లు సంతృప్తి చెందుతారా? చంద్రబాబు ఎత్తు గడలు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి. అదే సమయంలోటిడిపిలోని పాత కాపులు కర్నూలు లాంటి చోట గోడ దూకే అవకాశాలు లేక పోలేదు.

ఈ ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు పలు అడ్డ దారులు తొక్కుతునారు. నేతల నుండి ప్రజల నుండిఎదురు ప్రశ్నలు రాకుండా వుండేందుకు ఒక్కో తప్పుటడుగుకు అందమైన పేర్లు పెడుతున్నారు. అంతిమంగా ఫలితం ఏలా వుంటుందో చూడాలి. చంద్రబాబు జగన్ ఇద్దరిలో ఎవరు ఓడినాఅంతిమంగా రాష్ట్రంలో వారు దుకాణం కట్టేయ వలసిందే.

 

(*రచయిత రాయలసీమ రాజకీయ వ్యాఖ్యాత, ఫోన్ నెం 9848394013)

Advertisement

- Advertisement -

Related Posts

పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు ఎక్కడ ?

జానారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.చాలా ఫేమస్ అండ్ పొలైట్ పొలిటీషియన్. ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రితో పాటు ఎన్నో మంత్రి పదవులు ఆయన్ని వరించాయి. ఒకప్పుడు సీఎం రేసులో కూడా నిలిచారు....

నల్లారి వారి అల్లరితో జట్టు పీక్కుంటున్నచంద్రబాబు

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి...మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు. అన్నముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఇక నెల్లూరు జిల్లాలో అయితే ఆయన మాటే వేదంగా నడిచింది....

గంటా శ్రీనివాస్ రావు గంట మోగిస్తారా ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రూటు ఎటు వైపు... టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ఈ ప్రక్రియ మాత్రం ముందుకు...

Recent Posts

లోకేష్ బాబు కాలు పెడితే సొంత నేతలలో అసంతృప్తి

ఆంధ్ర ప్రదేశ్ :అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ చెప్పిందే జరిగేది, అంతా ఆయన ఇష్ట ప్రకారంగానే నడుచుకునేవారు నాయకులు, కార్య కర్తలు . ఆయన పర్యటనలకు వస్తే టీడీపీ...

ట్రాఫిక్ జరిమానాలపై జగన్ ను విమర్శిస్తున్న వారికి మంత్రి పేర్ని నాని కౌంటర్

అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఆ సినిమాలో ముఖ్యమంత్రి...

అక్కినేని అభిమానులకి దసరా కానుకగా రేపు అఖిల్ న్యూ మూవీ టీజర్ రిలీజ్

దసరా సందర్భంగా హీరోలంతా తమ సినిమాలకు సంబంధించిన కొత్త కొత్త అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా ఇదే చేస్తున్నాడు....

ఇది బీహార్ కాదు ఆంధ్ర ప్రదేశ్ అంటూ నిమ్మగడ్డ రమేష్ పై కొడాలి నాని అసహనం!

ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా...

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే అర్హత లేద‌ని వ్యాఖ్య‌లు

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

వైసీపీలోకి వెళ్లి తప్పు చేశా.. టీడీపీలోనే ఉండాల్సిందని ఫీలవుతున్న ఫ్యాక్షన్ లీడర్

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున కాళ్ళ ముందు మెదులుతాయి.  ఆ తరహా రాజకీయాలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు.  కానీ వాటిల్లోంచి నాయకులుగా పుట్టినవారు అక్కడ...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే అంటున్నారు..?

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

Movie News

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

Bigg boss 4: ఈ వారం హోస్ట్ సమంతనే… ఇది ఫిక్స్.....

తెలుగు రాజ్యం ముందే చెప్పింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావట్లేదు. సమంత వస్తోందని. చెప్పినట్టుగానే జరిగింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావడం లేదు. నాగ్ కోడలు, ప్రముఖ...

శివుడి అవ‌తారంలో స్టార్ హీరో.. కొట్టి పారేసిన టీం

సినిమాల‌కు సంబంధించి ఇటు సోష‌ల్ మీడియాలో కాని అటు ఫిలిం న‌గ‌ర్‌లో కాని చ‌క్క‌ర్లు కొట్టే వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నిజ‌మెంత ఉందో, అబ‌ద్ద‌మెంత ఉందో తెలుసుకోవ‌డానికి చాలా రోజులు...

మ‌ల్లిక ఇంత మూడీగా ఉందేంటి , బ‌స్తీ బాల‌రాజు ఏమ‌న్నాడు ?

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఆస‌క్తిక‌ర చిత్రాల‌లో చావు క‌బురు చ‌ల్లగా. ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, గ్లామ‌ర్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే...

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

Bigg boss 4: శనివారం నో హోస్ట్.. ఆదివారం సాయంత్రం 6...

బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఇక ఈ వారం ఎలాగూ నాగార్జున హోస్ట్ గా రాడని తెలిసిసోయింది కదా. ఆయనెక్కడో షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నారు. దీంతో...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే...

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

Dharsha Gupta Joshful Photos

Tamil Actress,Dharsha Gupta Joshful Photos Check out,Dharsha Gupta Joshful Photos,Dharsha Gupta Joshful Photos ,Dharsha Gupta Joshful Photos Shooting spot photos,Actress Kollywood Dharsha Gupta Joshful...