ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవు..!

ఒక పక్క తియ్యదనం.. మరో పక్క అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఖర్జూరం అంటే కేవలం ఓ పండు కాదు. ఇది శరీరానికి శక్తిని నింపే స్వచ్ఛమైన సహజమైన ఆరోగ్య బూస్టర్‌. రోజువారీ జీవనశైలిలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, గుండె ఆరోగ్యం నిలబెట్టుకోగలం, హెమోగ్లోబిన్ పెరుగుతుంది. అంతేకాకుండా, అంతర్గతంగా శరీరాన్ని శుద్ధి చేసే శక్తివంతమైన ప్రకృతి ఔషధం కూడా కలిగిస్తుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తీపిగా ఉండటంతో ఖర్జూరం intake ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహంతో బాధపడేవారు లేదా బరువు పెరగడం ఉద్దేశించని వారు జాగ్రత్తగా ఉండాలి. రోజుకి 3 నుంచి 5 ఖర్జూరాల పరిమితిని పాటించడం ఉత్తమం. బజారులో ఎక్కువ మెరుపు ఉండే ఖర్జూరాలు ఆకట్టుకుంటున్నా, ఇవి రసాయనాలతో ప్రాసెస్ చేయబడి ఉండే అవకాశమున్నందున, వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. అంతేగాక, చాలా మంది రాత్రిపూట భోజనం తర్వాత తీపి తినాలన్న ఆలోచనతో ఖర్జూరాలను ఎక్కువ సంఖ్యలో తింటారు. ఇది జీర్ణవ్యవస్థపై భారం పెడుతుంది. ఖర్జూరాన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం ఉత్తమం.

ఇంకొంతమంది చక్కెర, బెల్లం లేదా ఇతర తీపి పదార్థాలతో కలిపి ఖర్జూరం తింటారు. ఇది ఖర్జూరం సహజ శక్తిని తగ్గించడమే కాకుండా అనవసర క్యాలొరీలు కూడా పెంచుతుంది. ఖర్జూరాన్ని సహజ రూపంలో తీసుకోవడం వల్లనే దీని అసలైన ప్రయోజనాలు అందుతాయి. పుష్కల పోషక విలువలు ఉన్నా, కొన్ని సాధారణమైన తప్పులు ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. అందుకే శ్రద్ధగా, సమర్థంగా దీనిని ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాకుండా, అధికంగా తినడం కంటే పరిమితముగా, సురక్షితంగా తినడం ద్వారా దీని అద్భుత ఫలితాలను అనుభవించవచ్చు.