మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తోన్న సీఎం జగన్.!

CM pics taking wrong step again

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని అడుగుతూనే వుంటామంటూ ముఖ్యమంత్రి పదవి దక్కినప్పటినుంచీ ఒకటే మాట చెబుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిజమే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి, పార్లమెంటులో పూర్తి మెజార్టీ వున్న దరిమిలా.. రాష్ట్రం నుంచి ఎంతలా గొంతు చించుకున్నా, పట్టించుకునే అవకాశమే లేదు ప్రత్యేక హోదా విషయంలో. అదే పరిస్థితి విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలోనూ రాష్ట్రానికి ఎదురు కాబోతోందా.? అంటే, ఔనని చెప్పక తప్పదు. విశాఖ ఉక్కు కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన చాలా కీలక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో వున్నాయి. రైల్వే జోన్ అందులో ఒకటి. విభజన చట్టం ప్రకారం ఓ స్టీలు ప్లాంటు, ఓ పోర్టు.. రాష్ట్రానికి రావాల్సి వుంది. వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా రావాల్సిందే. రాజధాని కోసం నిధులు కేంద్రం నుంచి రావాలి. ఇన్ని సమస్యలు వున్నా, ఇవేవీ కేంద్రానికి పట్టడంలేదు. అయినా, రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలకు కేంద్రాన్ని నిలదీసేంత తెగువ వుండడంలేదు.

CM pics taking wrong step again

‘అడుగుతూనే వుంటాం’ అన్న మాట, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలోనూ వైసీపీ వినిపించబోతోంది ఇకపై. ఎందుకంటే, అంతకు మించిన ఆప్షన్ ఇంకోటి లేదు. కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఎంత వేగంగా అడుగులేస్తోందో ముఖ్యమంత్రికి తెలియకుండా వుంటుందా.? అందుకే, వైఎస్ జగన్, ‘కేంద్రంపై ఒత్తిడి తెస్తాం..’ అని మాత్రమే విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల నేతలతో చెప్పారు. దానికే సదరు కార్మిక సంఘాల నేతలు పొంగిపోతూ, ‘సీఎం జగన్ మాట మీద మాకు నమ్మకం వుంది’ అనేశారు. ప్రత్యేక హోదా వచ్చిందా.? రైల్వే జోన్ వచ్చిందా.? అన్న అంశాల్ని ఒక్కసారి పరిగణనలోకి తీసుకుంటే, ‘జగన్ మీద నమ్మకం’ అనే మాటకే అర్థం వుండదు. ఇక్కడ వైఎస్సార్సీపీ అధినేతగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కలిసి వచ్చే పార్టీలతో ఓ పెద్దన్నలా ముందడుగు వేసి, ఆయా అంశాలపై రాష్ట్రం తరఫున నాయకత్వం వహించాలి. ఏమో, ముందు ముందు ఆ దిశగా జగన్ ముందడుగు వేస్తారేమో వేచి చూడాలి.