జనసేన నుంచి లోక్ సభకి టిక్కెట్ ట్రై చేస్తున్న ఆ సినీ ప్రముఖుడెవరు.?

ఆయనో సినీ ప్రముఖుడు.! ఆర్థికంగా బాగా బలమున్నోడు. సామాజికంగా ఈక్వేషన్స్ కూడా అనుకూలంగా వున్నోడట.! ఇప్పటివరకు అయితే రాజకీయం రుచి చూడలేదుగానీ, తెరవెనుక రాజకీయాలపై ఆసక్తి చాలా ఎక్కువేనట.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనతో వున్నాడట. ఈ విషయమై ఇప్పటికే నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏదన్నా లోక్ సభ సీటు ఖాయం చేస్తే, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల కోసం కూడా బాగానే ఖర్చు చేస్తానని చెప్పాడట.

అయితే, ఇంతవరకు సదరు సినీ ప్రముఖుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి హామీ దక్కలేదట. ఎవరా సినీ ప్రముఖుడు.? అంటూ సినీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. అయితే, విషయం అస్సలేమాత్రం బయటకు పొక్కకుండా ఆ ప్రముఖుడు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆ సినీ ప్రముఖుడు అత్యంత సన్నిహితుడట. వివిధ రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నా, ఆయన కేవలం జనసేన నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అడిగితే, వేరే పార్టీల నుంచి టిక్కెట్ రావొచ్చనీ, అయితే అది తనకు ఇష్టం లేదని, జనసేన నుంచి టిక్కెట్ రాకపోతే, రాజకీయాల వైపు చూడననీ, జనసేన పట్ల మాత్రం తనకు అదే సానుకూల భావన ఎప్పటికీ వుంటుందని చెబుతున్నాడట ఆ సినీ ప్రముఖుడు.

పూర్తిగా ‘నో’ చెప్పలేదుగానీ, జనసేన అధినేత ఆయనకు ‘హామీ’ ఇవ్వలేకపోతున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.!