పట్టాభికి 41(ఎ) నోటీసులు… కోర్టు చివాట్లు!

మినిమం కామన్ సెన్స్ లేకుండా.. అడ్డగోలుగా మాట్లాడతాడని.. తన్నీ తనకే తెలుసన్నన్నట్లుగా ప్రవర్తిస్తాడని.. వెనకా ముందూ చూడకుండా, స్థాయి చూడకుండా విమర్శలు చేస్తాడని.. ఫలితంగా పార్టీకి తనవంతు డ్యామేజ్ తాను చేస్తున్నాడని ఇంటా బయటా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇలా నోరు పారేసుకున్నందుకు కోర్టు చివాట్లు పెట్టింది!

వివరాళ్లోకి వెళ్తే… ఈ ఏడాది మే 6న ఒక టీవీ ఛానెల్ డిబేట్‌ లో పాల్గొన్న పట్టాభిరాం.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనదైన నోటి %#@*& తో మంత్రిపైనా, సర్కార్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మే 8న తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఫిర్యాదుపై 153, 153(ఎ), 505(2), 504, 120(బి) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టాభిరాం ఎ–1 కాగా, యాంకర్‌ మూర్తి ఎ–2, టీవీ ఛానల్ యాజమాన్యం ఎ–3గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎ–1 పట్టాభిరాం కు 41(ఎ) నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించలేదు.

పైగా… భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని చెప్పుకుంటారనే విమర్శ ఉన్న నేపథ్యంలో… తనను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై తణుకు పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు తీసుకోకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడం చేస్తున్నారని అన్నారు.

దీంతో ఈ విషయంపై న్యాయస్థానం సీరియస్ అయ్యిందని తెలుస్తుంది. పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు తీసుకోకపోవడం చట్టరీత్యా నేరమని న్యాయస్థానం పేర్కొంది. తక్షణమే పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి నోటీసులు తీసుకుని సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శనివారం తణుకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లారు పట్టాభి!

అనంతరం తన నోటీసులను తానే అడిగి పోలీసులనుంచి తీసుకున్నారని సమాచారం. దీంతో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు. అనంతరం సుమారు మూడు గంటల పాటు స్టేషన్‌ లోనే విచారించారు పోలీసులు. మరి ఈ విచారణకు పట్టాభి సహకరించారా.. సహకరిస్తే ఏమి చెప్పారు.. సహకరించకపోతే పోలీసులు అరెస్ట్ నోటీసులు తీసుకునే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది!