“నిజం గెలవాలి”… కచ్చితంగా మీరు ఇది చదవాలి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు… రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం 46వ రోజుకు చేరింది! ఈ సమయంలో “నిజం గెలవాలి” అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు! ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని కొంతమంది మరణించారని.. వారి కుటుంబాలౌ పరామర్శించాలని బయలుదేరుతున్నారు. వాస్తవానికి ఇది బాలయ్య చేయాలనుకున్న పని!

సరే ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ సంగతి కాసేపు పక్కనపెడితే… భువనేశ్వరి బస్సు యాత్రకు పెట్టిన పేరు నిజం కావాలనే ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే నిజం సగం గెలిచించి కాబట్టి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారని.. బెయిల్ కూడా దొరకడం లేదని.. ఆ నిజం పూర్తిగా గెలిస్తే చంద్రబాబు తోపాటు లోకెష్, భువనేశ్వరి కూడా లోపలకి వెళ్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో… అసలు ఏది నిజం… ఏ నిజం గెలవాలి.. మొదలైన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం!

ప్రస్తుతం చంద్రబాబుపై ప్రస్తుతం మూడు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. అందులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివిధ దశల్లో ఉన్నాయ్యి! ఉమ్మడి రాజధానిని అర్ధాంతరంగా వదిలేసి రాత్రికి రాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎందుకు వచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే! ఓటుకు నోటు వ్యవహారం నాడు ఏపీకి అంత నష్టం తెచ్చిపెట్టింది!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం:

2014 – 2019 మద్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారనేది అభియోగం. దీనికోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారని.. ఇందులో భాగంగా సీమెన్స్‌ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం అని సీఐడీ ఇప్పటికే కోర్టుకు తెలిపింది.

అయితే… ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. తాము ఒక్కరూపాయి కూడా ప్రకటించలేదని స్పష్టం చేసింది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఆ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా తరలించగా.. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.

ఇది స్కిల్ కేసు! ఈ విషయంలో పూర్తి సాక్ష్యాదారాలతో ఏపీ సీఐడీ పక్కాగా ఉందని అంటున్నారు. ఇందులో “నిజం గెలవాలి” అని వైసీపీ నేతలు, ప్రజలు కోరుకుంటున్నారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్:

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు విషయంలో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని సీఐడీ అభిగోగం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వీలైనంత క్లియర్ గా వివరించే ప్రయత్నం చేశారు. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్స్ ఇన్ని అష్టవంకర్లు తిరగడానికి గల కారణాలను స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా… చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్‌ కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన కాలేజీలు, భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్‌ మెంట్‌ ను వీరే గీశారని తెలిపారు. అనంతరం అదే అలైన్‌ మెంట్‌ ను సింగపూర్‌ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారని వివరించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయిందని ప్రభుత్వం చెబుతోంది.

దీంతో… వేల కోట్ల క్విడ్ ప్రోకో వ్యవహారంగా దీన్ని భావిస్తున్న నేపథ్యంలో… ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో కూడా “నిజం గెలవాలి” అని గట్టిగా కొరుకుంటున్నారు ఏపీ ప్రజానికం. కచ్చితంగా గెలవాలని అంటున్నారు.

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసు:

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులోనూ చంద్రబాబు అవినీతి వెల్లడైందని చెబుతున్నారు. సుమారు రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును బాబు తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టారని.. అప్పటివరకూ బ్లాక్‌ లిస్టులో ఉన్న ఆ కంపెనీని అప్పటికప్పుడు బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించి మరీ కట్టబెట్టారని సీఐడీ అభియోగం!

ఇదే సమయంలో… టెండర్ల టెక్నికల్‌ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారని.. ఎల్‌1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్‌ కు టెండరు కట్టబెట్టారని.. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదని.. ఫలితంగా 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారని.. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.

ఇలా ప్రధానంగా ఈ మూడు కేసుల్లోనూ నిజం గెలవాలని.. ఫలితంగా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటుండగా… కచ్చితంగా నిజం గెలవాలని, గెలిచిన తర్వాత చంద్రబాబు అసలు స్వరూపం ప్రజలకు తెలియాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా.. ఎవరు ఎలాగైనా.. ఎన్నికలలోపు ఈ మూడు కేసుల్లోనూ “నిజం గెలవాలి” అని ఏపీ ప్రజానికం కోరుకుంటున్నారు!!