గత నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ – 3 ని ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈ మూన్ మిషన్ ను ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది!
ఈ క్రమంలో అంతరిక్ష రంగంలో మరింతగా సత్తా చాటాలని భావించిన ఇస్రో… ఇందులో భాగంగా చంద్రుడిపై పరిశోధనల కోసం రోదసిలోకి భారత వ్యోమనౌక చంద్రయాన్-3 ని పంపింది. అయితే చంద్రయాన్ – 3 తన లక్ష్యం దిశగా విజయవంతంగా పయనిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన ఫోటోలను పంపించింది.
చంద్రయాన్-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత కొద్దిసేపటికే కొన్ని ఫోటోలు తీసి పంపించింది. ఈ ఫోటోలను ఇస్రో ఆన్ లైన్ లో పంచుకుంది. ఈ ఫోటోల్లో చంద్రుడిపై స్పష్టంగా కనిపిస్తోన్న బిలాల పేర్లను కూడా వెల్లడించింది.
చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్.. జాబిల్లి ఉపరితలం ఫొటోలను తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలలో జాబిల్లి ఉపరితలంపై బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో, హర్కేబి జే తదితర బిలాల ఫొటోలను ల్యాండర్ తీసింది.
మరోపక్క చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ లక్ష్యానికి మరింత చేరువైంది. ఈ సమయంలో శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
ఇదే సమయంలో రెంబో రీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కానుంది. ఈ సమయంలో ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
కాగా గత నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ – 3 ని ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈ మూన్ మిషన్ ను ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది!
ఈ క్రమంలో అన్నీ మరింత సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ కాలుమోపనుంది.
Chandrayaan-3 Mission:
View from the Lander Imager (LI) Camera-1
on August 17, 2023
just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad— ISRO (@isro) August 18, 2023