థాయిలాండ్ లో చీకోటి అరెస్ట్… జగనే కారణం… ఇది వాస్తవం!

థాయిలాండ్ దేశంలోని పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ అరెస్టయ్యారు. ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే… థాయిలాండ్ లో చీకోటి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కూడా కీలక చర్చకు, విమర్శలకు దారితీసింది. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? వాస్తవాలేమిటి? వాస్తవాలు తెలిసినా కూడా మౌనంగా ఉంటున్న పిరికి నాయకులెవరు? మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం..!

థాయిలాండ్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ అరెస్టవడంతో మైకులముందుకు వచ్చారు ఏపీ టీడీపీ నేతలు. కారణం… ప్రపంచంలో ఏ దరిద్రం జరిగినా… దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి జగన్ పై విమర్శలు చేయడం వారికి వెన్నతోపెట్టిన విధ్య. సత్యాసత్యాలతో వారికి సంబంధం లేదు, అసలు వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా… ఆ సమయంలో వారు అందులూ, బధిరులు అయిపోతారు. మరికొన్ని సార్లు… నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటారు.

వివరాళ్లోకి వెళ్తే… థాయిలాండ్ లో ప్రవీణ్ కుమార్ అరెస్టవ్వగానే మైకందుకున్న టీడీపీ నేతలు… ఈ వ్య్వహారంలో జగన్ సర్కార్ కు సంబంధం ఉందని తేల్చేశారు. థాయిలాండ్‌ లో ఒక‌ హోటల్‌ లో చీకోటి సార‌థ్యంలో జూదం ఆడిస్తుండ‌గా అక్కడ పోలీసులు దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రవీణ్ తో పాటు 100 మంది ప‌ట్టుబ‌డ్డారు. వీరిలో 83 మంది భార‌తీయులున్నారు. వీరంతా ప‌ట్టుబ‌డ‌డానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌ని టీడీపీ జాతీయ ప్రతినిధి ఆరోపించ‌డం, దానికి టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇవ్వడం గ‌మ‌నార్హం.

గుడివాడ‌లో క్యాసినో నిర్వహించారని, అప్పుడే తాము ఫిర్యాదు చేసిన‌ప్పుడు చర్యలు తీసుకుని వుంటే… ఇవాళ ఇంత మంది భార‌తీయులు ప‌ట్టుబ‌డి వుండేవారు కాద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ… వాస్తవం ఏమిటంటే… ఈ కార్యక్రమంలో చీకోటితో పాటు మరో వ్యక్తి అరెస్టయ్యారు. అయన మరెవరో కాదు… బీఆరెస్స్ నేత, మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి! అవును… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన చిట్టి దేవేందర్ రెడ్డి… ఈ కేసులో చీకోటితో పాటు అరెస్టయ్యారు. చీకోటితో ఈయనకు చీకటి ఒప్పందాలున్నాయని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

ఇది వాస్తవం! కళ్లముందు కనిపిస్తున్న నిజం! కానీ… ఈ విషయంపై నోరు మెదపని టీడీపీ నేతలు, నోరు మెదపలేని నాయకులు… జగన్ సర్కార్ పై నోరేసుకుని పడిపోతున్నారు. ఇక్కడ కళ్లముందు కనిపిస్తున్నా… కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే… వణుకో బెణుకో తెలియదు కానీ… జగన్ సర్కార్ పై మాత్రం బురద చల్లడానికి బకెట్లతో డ్రైనేజ్ కాలువల వద్ద రెడీగా ఉంటున్నారు! ఫలితంగా… ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నారు!