పుణ్యక్షేత్రాలు పై కరోనా వైరస్ పగ !

TTD, Tirumala

ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి పుణ్య క్షేత్రం నేడు కరోనా పడగ నీడలో తన్నుకు లాడుతోంది. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నదే గాని తగ్గుముఖం పట్టడం లేదు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. సంతోషించ వలసిన అంశమేమంటే శ్రీ వారి కరుణా కటాక్షాలతో యాత్రికులెవరూ వైరస్ బారిన పడటంలేదు. లాక్ డౌన్ సడలించిన తర్వాత అధికారుల చర్యలు నిరుపయోగ మౌతున్నాయి. స్థానికులు దేవస్థానం సిబ్బంది వైరస్ కు గురౌతున్నారు. ప్రస్తుతం పరిమితంగా లాక్ డౌన్ విధించేందుకు అధికారులు సమాయత్తమౌతున్నారు.

Read More : కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో సచిన్

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పరిశీలించితే లాక్ డౌన్ సడలించిన తర్వాత దానితో పాటు తిరుమల శ్రీవారి ఆలయం ద్వారాలు తెరిచిన తర్వాత జిల్లాలో ఇతర పట్టణాలతో పోల్చితే తిరుపతిలో మాత్రం కేసులు ఆంజనేయుని వాలంలాగా పెరుగుతున్నాయి. తిరుపతికి వచ్చే భక్తులు వైరస్ బారిన పడే అవకాశం పక్కన బెడితే యాత్రికుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం త్రోసి పుచ్చ లేము. టిటిడి అధికారులు చెబుతున్నట్లు యాత్రికుల ద్వారా వైరస్ వ్యాప్తి చెంద కుంటే చిత్తూరు జిల్లా లోని ఇతర ప్రధాన పట్టణాల్లో ఈ మేరకు కేసులు ఎందుకు పెరగడం లేదు? ఎట్ట కేలకు టిటిడి ఇఓ 91 మంది టిటిడి సిబ్బంది కరోనా బారిన పడ్డట్టు ప్రకటించారు. శ్రీ వారి ఆశ్శీసులతో భక్తులెవరూ వైరస్ బారిన పడకుంటే అంతకన్నా కావలసినది లేదు. 

Read More : కాపు ఉద్య‌మం : ముద్రగడ సంచలన నిర్ణయం..!

జూన్ 8వ తేదీ లాక్ డౌన్ సడలించారు. జూన్ 11 వతేదీ 79 రోజుల తర్వాత తిరుమల ఆలయం ద్వారాలు తెరచి భక్తులకు శ్రీ వారి దర్శన భాగ్యం కలిగించారు. జూన్ 12 వతేదీకి తిరుపతిలో మొత్తం 47 కేసులు మాత్రమే నమోదు అయితే అదే జూలై 12 తేదీకి తిరుపతి అర్బన్ లో 957 తిరుపతి రూరల్ లో 183 కలుపుకొని మొత్తం 1140 కు కేసుల సంఖ్య పెరిగింది.అదే చిత్తూరు జిల్లాలో తొలుత శ్రీ కాళహస్తి లో జూన్ 12 వతేదీ 103 కేసులు నమోదు అయితే జూలై 12 వతేదీ 218మాత్రమే పెరిగాయి. జిల్లా కేంద్రం చిత్తూరులో జూన్ 12 తేదికి 31 కేసులు నమోదు కాబడితే ఒక మాసంలోపు జూలై 12 తేదీకి 205 మాత్రం నమోదు అయ్యాయి. మరొక పెద్ద టవున్ మదనపల్లెలో జూన్ 12 తేదీకి మొత్తం 9 కేసులు వుంటే జూలై 12 కు 72 కేసులు నమోదు అయ్యాయి. మరి జిల్లాలో ఇతర ప్రధాన పట్టణాల్లో పెరిగిన కేసులతో పోల్చుకుంటే తిరుపతిలో మాత్రం కేసులు అనూహ్యంగా పెరుగుదల కారణం అధికారులు చెప్పవలసి వుంది.

Read More : నెట్‌ఫ్లిక్స్ ఆల్ట్ బాలాజీ‌తో ఇలియానా బిగ్ డీల్

ఆ మధ్య టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడే వరకు కరోనా వైరస్ బారిన పడిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అంశం గోప్యంగా వుంచారు. ఆఖరుగా జూలై 12న టిటిడి ఇఓ నోరు విప్పారు. టిటిడి చైర్మన్ కూడా కొందరు సిబ్బంది కరోనా బారిన పడిన అంశం వెల్లడించుతూ వారి కుటుంబీకులు స్థానికంగా తిరిగిన వలన వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు. ఒక వేళ అదే నిజమైతే తిరుపతికి వచ్చే యాత్రికులను మినహాయించితే తిరుపతి కన్నా ఎక్కువగా చిత్తూరుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత జిల్లా కలెక్టరేట్ కు వచ్చి వెళ్లే వారు ఎక్కువ. చిత్తూరులో కేసులు పెరగ లేదు-గాని తిరుపతిలో రోజు రోజుకూ అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి.తిరుపతిలోనే కేసులు పెరగడానికి జిల్లాలో ఇతర పట్టణాలకు భిన్నంగా తిరుపతి ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్నారా? లేక ప్రభుత్వ వైఫల్యమా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

 Read More : ర‌కుల్ వర్సెస్ త‌మ‌న్నా.. స‌డెన్‌గా క్రేజీ ఆఫ‌ర్స్

జిల్లాలో మార్చి 24 వతేదీ ఒక కేసు నమోదు అయింది. జూన్ 12 వతేదీ నాలుగు కేసులు నమోదు అయితే అప్పటికి మొత్తం 331 కేసులు వుంటే లాక్ డౌన్ సడలించడం పైగా భక్తులు తాకిడి పెరగడంతో జూలై 11 వతేదీ ఒక్క రోజు 300 కేసులు నమోదై మొత్తం 2509 కి కేసుల సంఖ్య చేరింది. గమనార్హమైన అంశమేమంటే జూలై 11 వతేదీ నమోదైన 300 కేసుల్లో ఒక్క తిరుపతి అర్బన్ లో 144 రూరల్ లో 24 మొత్తం కలిపి 168 కేసులు సంహభాగం వున్నాయి.

జిల్లాలోని ఇతర పట్టణలతో తిరుపతి పోల్చుకుంటే ఇచ్చట ప్రైవేటు వైద్య సంస్థలు ఎక్కువగా వున్నాయి. అంతేకాదు రూయా స్విమ్సు ఆసుపత్రులకు ఇతర జిల్లాల నుండి వైద్యం ప్రజలు వస్తున్నారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత ఇతర వ్యాధులతో బాధ పడే రోగులు విపరీతంగా రావడం కూడా ఒక కారణంగా వుంది. ఏదిఏమైనా తిరుపతి టవున్ కరోనా పడగ నీడలో బతుకుతోంది.